పేద విద్యార్థినికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించిన చైర్‌పర్సన్ గడ్డం అనన్య
వికారాబాద్, మేజర్ న్యూస్: వికారాబాద్ పట్టణంలోని 25వ వార్డు సుభాష్‌నగర్‌కు చెందిన వెంకటేష్ యాదవ్, రేణుక దంపతుల కుమార్తె, బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న తేజస్వినికి మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. మొయినాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న తేజస్విని కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న అనన్య మానవతా దృక్పథంతో స్పందించి చదువుకు చేయూతనిచ్చారు.ఈ సందర్భంగా తేజస్విని కష్టపడి చదువుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పేద విద్యార్థుల చదువులు మధ్యలో ఆగిపోకూడదని, ప్రతిభ ఉన్న విద్యార్థులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని అనన్య పేర్కొన్నారు. విద్యతోనే కుటుంబాల అభివృద్ధి సాధ్యమని, తేజస్విని భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించి తల్లిదండ్రులతో పాటు వికారాబాద్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. తమ కుమార్తె చదువుకు ఆర్థిక సాయం అందించి అండగా నిలిచిన మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్యకు, సహకరించిన తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌కు తేజస్విని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. పేద విద్యార్థిని చదువుకు చేయూతనందించిన అనన్యను స్థానికులు అభినందించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ద సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్స్ రాకేష్, మల్లికార్జున్ గౌడ్, తదితరులు ఉన్నారు.