BREAKING
ఘనంగా జ్యువెల్ హైట్స్‌లో శ్రీ విజయ వినాయక గణపతి ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవం ఇందిరాగాంధీకి ఘన నివాళి దేశానికి ఇందిరా గాంధీ చేసిన సేవలు మరువలేనివి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా కె. సుధారాణి బాధ్యతల స్వీకరణ.. పుట్టినరోజు వేడుకల్లో చిన్నారులకు చేయూత పేద విద్యార్థినికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించిన చైర్‌పర్సన్ గడ్డం అనన్య రుద్రపూర్‌లో 32 మందికి చేయూత పెన్షన్ల పంపిణీ పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన సబ్ కలెక్టర్.. మరికాసేపట్లో ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ కీలక భేటీ విద్యార్థులకు గ్రంథాలయ ప్రాముఖ్యతపై అవగాహన నికోల్స్ సెంచరీ..తొలి టెస్టు తొలిరోజు న్యూజిలాండ్ 243/5 వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి ఇబ్బందులు పడవద్దు • ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వలస కార్మికులతో స్పెయిన్ ఆర్థిక జోరు ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం – ఎమ్మెల్యే జీటీఏ సిక్స్ వేళ ప్రధాని మోదీ ఆసక్తికర పోస్ట్

ఆలూరు గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసును పునరుద్ధరించాలి

Select Suryaa Now
ఆలూరు గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసును పునరుద్ధరించాలి

రంగారెడ్డి : చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని ఆలూరు గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసును తిరిగి పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మేరకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు బుధవారం వినతిపత్రం అందజేశారు.
గ్రామం నుంచి ప్రతిరోజూ ఎంతోమంది విద్యార్థులు చదువుల నిమిత్తం చేవెళ్లలోని పాఠశాలలు, కళాశాలలకు వెళ్తుంటారని, అదేవిధంగా రైతులు, ఇతర గ్రామస్తులు వివిధ పనుల కోసం ప్రయాణాలు చేస్తుంటారని వినతిపత్రంలో పేర్కొన్నారు. గతంలో నడిచిన ఆర్టీసీ బస్సు సర్వీసును అకస్మాత్తుగా నిలిపివేయడంతో విద్యార్థులు, రైతులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ముఖ్యంగా సమయానికి బస్సులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు ఆలస్యంగా చేరుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కొనసాగిన ఉదయం 8:30 గంటల బస్సు సర్వీసుతో పాటు మధ్యాహ్నం 2:30 గంటలకు, రాత్రి 8:30 గంటలకు బస్సులను తిరిగి నడిపించాలని ఎమ్మెల్యేను కోరారు.
విద్యార్థులు, రైతులు, గ్రామ ప్రజల ప్రయాణ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ అధికారులతో మాట్లాడి నిలిపివేసిన బస్సు సర్వీసును పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వి.శ్రీనివాస చారి : రంగారెడ్డి -మేజర్ న్యూస్