BREAKING
హాలీవుడ్‌లో సంచలనం.. తన ప్రొడక్షన్ కంపెనీని మళ్లీ వెనక్కి కొనుగోలు చేసిన ప్రముఖ నటి రీస్ విదర్‌స్పూన్ తాండూరులో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్.. ఫ్లెక్సీల వివాదంతో రచ్చకెక్కిన అంతర్గత విభేదాలు గ్రీస్ వీధుల్లో మనవళ్లతో సూపర్ స్టార్ సందడి.. రజనీకాంత్ అరుదైన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేసిన సౌందర్య కొత్త జేమ్స్ బాండ్ ఎంపికపై ఆసక్తికర నిజాలు బయటపెట్టిన జెఫ్ బెజోస్.. తొలుత రాబర్ట్ ప్యాటిన్సన్‌ను వద్దనుకోవడానికి అసలు కారణం ఇదే! దారుణమైన మోసం.. డబ్బులిచ్చి వీడియో తీసి వెనక్కి తీసుకున్నారు: బాలీవుడ్ నటుడి సంచలన వ్యాఖ్యలు తాండూరులో రాజకీయ దుమారం.. బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ ముందస్తు అరెస్ట్ నెగెటివిటీనే నాలో కసి పెంచుతుంది.. ట్రోల్స్‌పై స్పందించిన పాన్ ఇండియా హీరో దుల్కర్ సల్మాన్ అంతర్జాతీయ వెబ్‌సిరీస్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు.. ఏఎం ఫార్స్టర్ క్లాసిక్ నవల ఆధారంగా అట్టహాసంగా ‘ఎ పాసేజ్ టు ఇండియా’ కౌన్సిలర్ అజయ్ కుమార్ జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్లారెడ్డి ఓటీటీలోకి సడన్‌గా వచ్చేసిన కన్నడ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే? బాక్సాఫీస్ వద్ద రామాయణం మేజిక్.. పదమూడో రోజుకు ఎనిమిది వందల కోట్ల మార్కును దాటిన రణ్‌బీర్ కపూర్ చిత్రం ఇందిరమ్మ జీవిత బీమా పై అవగాహన కార్యక్రమం సామాన్యులకు సాహిత్య మాధుర్యాన్ని చేరువ చేసేది సినిమాపాటే.. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ! మూడు చింతలపల్లికి నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంజూరు రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా.. నేటి నుంచే దరఖాస్తులు

తాండూరులో రాజకీయ దుమారం.. బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ ముందస్తు అరెస్ట్

Select Suryaa Now
తాండూరులో రాజకీయ దుమారం.. బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ ముందస్తు అరెస్ట్

తాండూరు, మేజర్ న్యూస్: తాండూరు పట్టణంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ ముందస్తు అరెస్ట్ వ్యవహారం రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణంలోని 8వ వార్డులో ఎమ్మెల్యే చేతుల మీదుగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు కౌన్సిలర్ జావిద్‌ను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాలనీవాసులు పోలీసుల చర్యను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ పోలీసులు జావిద్‌ను అదుపులోకి తీసుకుని గౌతాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో కౌన్సిలర్ పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ, తమ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రశ్నించడం తప్పా? అని నిలదీసినట్లు తెలిసింది. మరోవైపు, తమ పార్టీ కౌన్సిలర్‌ను ముందస్తుగా అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పోలీసుల తీరును ప్రశ్నించారు. వార్డులో అభివృద్ధి పనులపై ప్రశ్నించినందుకే అరెస్ట్ చేశారా..? అంటూ నిలదీశారు. ఎమ్మెల్యే పర్యటన, శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు తాండూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కౌన్సిలర్ ముందస్తు అరెస్టుకు గల కారణాలపై పోలీసుల అధికారిక వివరణ తెలియాల్సి ఉంది.