రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా.. నేటి నుంచే దరఖాస్తులు
సూర్య తాడ్వాయి : రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా.. నేటి నుంచే దరఖాస్తులు తెలంగాణ ప్రభుత్వం కోటికిపైగా కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని నవంబర్ 19 నుంచి ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్దిపేట సభలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. కుటుంబంలో సంపాదించే ఒకరికి మాత్రమే బీమా వర్తిస్తుంది. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న వారు అర్హులు. బీమా పొందిన వ్యక్తి మరణిస్తే కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు దరఖాస్తులు, నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. గ్రామాలు, వార్డుల్లో ప్రత్యేక శిబిరాల ద్వారా నమోదు చేస్తారు..