BREAKING
నెగెటివిటీనే నాలో కసి పెంచుతుంది.. ట్రోల్స్‌పై స్పందించిన పాన్ ఇండియా హీరో దుల్కర్ సల్మాన్ అంతర్జాతీయ వెబ్‌సిరీస్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు.. ఏఎం ఫార్స్టర్ క్లాసిక్ నవల ఆధారంగా అట్టహాసంగా ‘ఎ పాసేజ్ టు ఇండియా’ కౌన్సిలర్ అజయ్ కుమార్ జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్లారెడ్డి ఓటీటీలోకి సడన్‌గా వచ్చేసిన కన్నడ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే? బాక్సాఫీస్ వద్ద రామాయణం మేజిక్.. పదమూడో రోజుకు ఎనిమిది వందల కోట్ల మార్కును దాటిన రణ్‌బీర్ కపూర్ చిత్రం ఇందిరమ్మ జీవిత బీమా పై అవగాహన కార్యక్రమం సామాన్యులకు సాహిత్య మాధుర్యాన్ని చేరువ చేసేది సినిమాపాటే.. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ! మూడు చింతలపల్లికి నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంజూరు రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా.. నేటి నుంచే దరఖాస్తులు ఫిలిప్పీాన్స్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా నెట్టింట వైరల్ అవుతున్న సమంత బేబీ షవర్ ఫొటోలు.. అసలు నిజం ఏంటంటే! ఆలూరు గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసును పునరుద్ధరించాలి తాండూరు రూరల్ సీఐగా చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ క్యూ స్పోర్ట్స్ అద్భుత విజయాలతో టోర్నీని ఆరంభించిన పంకజ్ అద్వానీ, అనుపమ రామచంద్రన్ కవల పిల్లల జననం తర్వాత ఎన్నో కష్టాలు.. అనుభవాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైన ఉపాసన!

కృష్ణ నగర్ కాలనీలో నూతన డ్రైనేజీ పైపులైన్ పనుల ప్రారంభం

Select Suryaa Now
కృష్ణ నగర్ కాలనీలో నూతన డ్రైనేజీ పైపులైన్ పనుల ప్రారంభం

సికింద్రాబాద్ మేజర్ న్యూస్  : 
బన్సిలాల్‌పేట్ డివిజన్ పరిధిలోని బోలక్‌పూర్, కృష్ణనగర్ కాలనీ వాసులు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. కాలనీలో నెలకొన్న తీవ్రమైన మురుగునీటి సమస్యపై బస్తీ వాసులు స్థానిక శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కి వినతిపత్రం అందజేశారు.
ఈ విజ్ఞటనపై వెంటనే స్పందించిన తలసాని శ్రీనివాస్ యాదవ్, సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వాటర్ వర్క్స్ జి.ఎం.కి ప్రత్యేకంగా వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే చొరవతో అధికారులు వెంటనే స్పందించి, నేడు కృష్ణనగర్ కాలనీలో నూతన డ్రైనేజీ పైపులైన్ నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా తమ సమస్య తక్షణమే పరిష్కారానికి నోచుకోవడం పట్ల బస్తీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కి మరియు అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నూతన డ్రైనేజీ పైపులైన్ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు ఎల్. వెంకటేశం రాజు, మాజీ కార్పొరేటర్ ఏ. సూరి, సావిత్రి మహేష్, రాంబాబు, మహేందర్ గౌడ్, కొత్తూరు వెంకటేష్, సుధాకర్ రెడ్డి, ముక్క శీను తదితర నాయకులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.