నామినేషన్ల స్వీకరణ, ఆన్లైన్ నమోదుపై దిశానిర్దేశం పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై అధికారులతో సమావేశం
వెల్దుర్తి, మేజర్ న్యూస్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచులు, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియపై సంబంధిత అధికారులతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో స్టేజ్-1 రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), సహాయ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్వోలు), పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ అభివృద్ధి అధికారులు, డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఎన్నికల నామినేషన్లను ఏ విధంగా స్వీకరించాలి, వివరాలను ఆన్లైన్లో ఎలా నమోదు చేయాలి, సంబంధిత పత్రాలను ఏ పద్ధతిలో స్కానింగ్ చేయాలి అనే అంశాలపై అధికారులకు అవగాహన కల్పించారు.