BREAKING
ఘనంగా జ్యువెల్ హైట్స్‌లో శ్రీ విజయ వినాయక గణపతి ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవం ఇందిరాగాంధీకి ఘన నివాళి దేశానికి ఇందిరా గాంధీ చేసిన సేవలు మరువలేనివి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా కె. సుధారాణి బాధ్యతల స్వీకరణ.. పుట్టినరోజు వేడుకల్లో చిన్నారులకు చేయూత పేద విద్యార్థినికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించిన చైర్‌పర్సన్ గడ్డం అనన్య రుద్రపూర్‌లో 32 మందికి చేయూత పెన్షన్ల పంపిణీ పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన సబ్ కలెక్టర్.. మరికాసేపట్లో ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ కీలక భేటీ విద్యార్థులకు గ్రంథాలయ ప్రాముఖ్యతపై అవగాహన నికోల్స్ సెంచరీ..తొలి టెస్టు తొలిరోజు న్యూజిలాండ్ 243/5 వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి ఇబ్బందులు పడవద్దు • ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వలస కార్మికులతో స్పెయిన్ ఆర్థిక జోరు ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం – ఎమ్మెల్యే జీటీఏ సిక్స్ వేళ ప్రధాని మోదీ ఆసక్తికర పోస్ట్

ప్రభుత్వ ఆదేశాలు భేఖతర్ ఎమ్మార్పీ కన్నా మద్యం అధిక ధరలు

Select Suryaa Now
ప్రభుత్వ ఆదేశాలు భేఖతర్  ఎమ్మార్పీ కన్నా మద్యం అధిక ధరలు

రావికమతం, మేజర్ న్యూస్:

  లైసెన్స్ పొందిన మద్యం దుకాణాల నిర్వాహకులు నిబంధనలు అతిక్రమించి ఎమ్మార్పీ  కన్నా అదనంగా  బాటిల్ కు  పది రూపాయలు  అధికంగా అమ్ముతున్నారని ప్రభుత్వ ఖజానాకు ఆదాయం చేకూర్చే మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఈ దోపిడిని అరికట్టాల్సిన అధికారులు  చూసి చూడనట్టు వ్యవహరిస్తుండటంతో   దుకాణదారులు  బరితెగిస్తున్నారని టాక్స్ ప్లేయర్స్ మండిపడుతున్నారు. అధిక ధరలపై  మీడియాలో కథనాలు వచ్చిన సందర్భంలో తుతూ  మంత్రంగా తనిఖీలు జరిపి చేతులు దులుపుకుంటున్నారని వాపోతున్నారు. మరొకవైపు  షాపు పరిధిలో ఉన్న గ్రామాలలో సందు సందులో  బెల్ట్  షాపులు ఏర్పాటుచేసి   మద్యం  ఏరులై పారెందుకు దారులు తెరుస్తున్నారు. ఈ బెల్ట్ షాపులో  ఎమ్మార్పీ కన్నా ప్రతి బాటిల్ పైన నిర్వాహకులు అదనంగా 20 రూపాయలు మద్యం ప్రియుల నుంచి  ముక్కు పిండి వసూలు చేస్తున్నారు . ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఖజానాకు ఆదాయం  సమకూర్చుతున్న తమ బాధలు  ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై  త్యాగమూర్తులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రిపోర్టర్ .వాసు , (అనకాపల్లి జిల్లా)రావికమతం.