BREAKING
ఘనంగా జ్యువెల్ హైట్స్‌లో శ్రీ విజయ వినాయక గణపతి ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవం ఇందిరాగాంధీకి ఘన నివాళి దేశానికి ఇందిరా గాంధీ చేసిన సేవలు మరువలేనివి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా కె. సుధారాణి బాధ్యతల స్వీకరణ.. పుట్టినరోజు వేడుకల్లో చిన్నారులకు చేయూత పేద విద్యార్థినికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించిన చైర్‌పర్సన్ గడ్డం అనన్య రుద్రపూర్‌లో 32 మందికి చేయూత పెన్షన్ల పంపిణీ పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన సబ్ కలెక్టర్.. మరికాసేపట్లో ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ కీలక భేటీ విద్యార్థులకు గ్రంథాలయ ప్రాముఖ్యతపై అవగాహన నికోల్స్ సెంచరీ..తొలి టెస్టు తొలిరోజు న్యూజిలాండ్ 243/5 వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి ఇబ్బందులు పడవద్దు • ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వలస కార్మికులతో స్పెయిన్ ఆర్థిక జోరు ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం – ఎమ్మెల్యే జీటీఏ సిక్స్ వేళ ప్రధాని మోదీ ఆసక్తికర పోస్ట్

ఉపాధ్యాయురాలి మెడలో బంగారు గొలుసు చోరీ

Select Suryaa Now
ఉపాధ్యాయురాలి మెడలో బంగారు గొలుసు చోరీ

గుంటూరు  :  స్థానిక పట్టాభిపురం పరిధిలోని విజయపురి కాలనీలో పట్టపగలే చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకొంది. ఓ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న ప్రమీల జోషి (50) మంగళవారం సాయంత్రం ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా, హెల్మెట్ ధరించి బైక్పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని 3 సవర్ల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. బాధితురాలు గొలుసును గట్టిగా పట్టుకోవడంతో కొంత భాగం ఆమె చేతిలో మిగిలింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ప్రమీల జోషి విజయపురి కాలనీ మెయిన్ రోడ్ లో దిగి తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా హెల్మెట్ ధరించి మోటార్ వెహికల్ పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని మూడు సవర్ల బంగారు గొలుసులు లాక్కొని పరారయ్యాడని పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు  పేర్కొన్నారు. బాధితురాలు గొలుసును గట్టిగా పట్టుకోవడంతో కొంత భాగం ఆమె చేతిలో ఉండిపోగా మిగిలిన భాగాన్ని నిందితుడు లాక్కొని వెళ్లిపోయాడని, బాధితురాలు కేకలు వేయడంతో సమీపం లో ఉన్న నివాసి రాధా బయటికి వచ్చి ఆమెతో కలిసి నిందితుడిని వెంటబడినప్పటికీ పట్టుకోలేకపోయారని  సీఐ తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్ల  సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపారు.

 

కే నాగరాజు గుంటూరు క్రైమ్