BREAKING
వత్సవాయిలో ప్రారంభమైన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ చంద్రారెడ్డి ఇంట విషాదం.. భార్య అనసూయ కన్నుమూత వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన*

వీబీజీ రామ్ జీ పథకంపై మానేపల్లిలో చైతన్య ర్యాలీ

Select Suryaa Now
వీబీజీ రామ్ జీ పథకంపై మానేపల్లిలో చైతన్య ర్యాలీ

 పి.గన్నవరం మేజర్ న్యూస్.పి.గన్నవరం మండలం మానేపల్లి గ్రామ పంచాయతీలో ఆదివారం వీబీజీ రామ్ జీ పథకం, సామాజిక తనిఖీలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఓ సీహెచ్.లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీజీ రామ్ జీ పథకం లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.

 ప్రతి కుటుంబానికి పని కల్పించడం, వలసలను అరికట్టడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. సామాజిక తనిఖీల ద్వారా పథకం అమలులో పారదర్శకత పెరుగుతుందన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు.శ్రామికులు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ ర్యాలీలో శ్రామికులు, ఫీల్డ్ సిబ్బంది, సామాజిక తనిఖీ బృంద సభ్యులు పాల్గొన్నారు. గ్రామ పురవీధుల గుండా సాగిన ర్యాలీలో ప్రతి చేతికి పని - పనికి తగిన వేతనంపై వలసలెందుకు దండగ - వీబీజీ రామ్ జీ ఉండగా,మన తనిఖీ - సామాజిక తనిఖీ
సామాజిక తనిఖీలో పాల్గొందాం -గ్రామాభివృద్ధికి తోడ్పడుదాం అంటూ నినాదాలు చేస్తూ గ్రామ ప్రజల్లో చైతన్యం నింపారు.ఈ కార్యక్రమంలో సామాజిక తనిఖీ బృందానికి చెందిన ఎస్ఆర్పీ పి. సింహాద్రి, డీఆర్పీ సతీష్ తదితరులు పాల్గొన్నారు.