BREAKING
దీక్ష దివస్ కార్యక్రమానికి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. * టీఆర్‌ఆర్‌ఎస్‌ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.. ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు...... * సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం బోరు మోటార్, దొంగల అరెస్ట్ మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

వరుస విజయాలతో చరిత్ర సృష్టించిన సర్పంచ్ నంబారి శ్రీను.

Select Suryaa Now
వరుస విజయాలతో చరిత్ర సృష్టించిన సర్పంచ్ నంబారి శ్రీను.

 

2006 - 2013 - 2021 - 2026 వరుస విజయాలు.

ప్రజల నమ్మకమే మా బలం - విజేత సర్పంచ్ నంబారి శ్రీను.

అనకాపల్లి, నవంబర్ 28, మేజర్ న్యూస్: ప్రజల నమ్మకాన్ని వరుసగా నిలబెట్టుకుంటూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించారు సంపతిపురం సర్పంచ్ నంబారి శ్రీను. 2006, 2013, 2021 ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన, 2026 ఎన్నికల్లోనూ అత్యధిక మెజారిటీతో గెలిచి నాలుగోసారి వరుస విజయాన్ని అందుకున్నారు.

వరుస విజయాల వివరాలు:

- 2006 - నంబారి అప్పారావు - మెజారిటీ 83

- 2013 - నంబారి శ్రీను - మెజారిటీ 143

- 2021 - నంబారి నాగమణి (భర్త శ్రీను) - మెజారిటీ 148

- 2026 - నంబారి శ్రీను - మెజారిటీ 351

గ్రామ అభివృద్ధే లక్ష్యంగా, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గత 20 సంవత్సరాలుగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సేవ చేస్తున్నందుకే ప్రజలు మళ్లీ మళ్లీ తమ ఆశీర్వాదాన్ని అందిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ప్రతిసారి పెరుగుతున్న మెజారిటీనే ప్రజల నమ్మకానికి నిదర్శనమని అన్నారు.

గత 20 సంవత్సరాలలో సర్పంచ్ నంబారి శ్రీను హయాంలో జరిగిన అభివృద్ధి పనులు:

భవనములు:

సంపతిపురంలో రూ.10 లక్షలతో పంచాయతీ భవనం, రూ.5 లక్షలతో అదనపు పాఠశాల భవనం, రూ.2 లక్షలతో అంగన్వాడీ భవనం, రూ.1 లక్షతో పైకా భవనం. తమ్మయ్యపేటలో రూ.4 లక్షలతో అదనపు పాఠశాల భవనం, రూ.5 లక్షలతో కాలనీలో కమ్యూనిటీ హాల్, రూ.10 లక్షలతో స్మశానంలో వెయిటింగ్ హాల్ మరియు దహన భవనం, రూ.5 లక్షలతో అంగన్వాడీ భవనం. చిన సంపతిపురంలో రూ.10 లక్షలతో అంగన్వాడీ భవనం, సత్యానగర్ కాలనీలో రూ.5 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం.

త్రాగునీరు:

సంపతిపురంలో రూ.10 లక్షలతో 20 వేల లీటర్ల వాటర్ ట్యాంకు, ఎస్.సి. కాలనీలో రూ.10 లక్షలతో 20 వేల లీటర్ల వాటర్ ట్యాంకు, రూ.8 లక్షలతో కొత్త పైపులైన్లు, ఎస్.సి. కాలనీలో చేతిబోరు. తమ్మయ్యపేటలో రూ.20 లక్షలతో 20 వేల లీటర్ల వాటర్ ట్యాంకు, పాఠశాలలో రిగ్ బోరు, రూ.80 వేలతో పరమటమ్మ తల్లి లోప దారిలో చేతి పంపు బోరు, రూ.1 లక్షతో పాత వాటర్ ట్యాంకు మరమ్మత్తులు, రూ.4 లక్షలతో కొత్త పైపులైన్లు, రూ.70 వేలతో మధ్యం వద్ద చేతిపంపు బోరు మరియు బట్టలు ఉతకటానికి దిమ్మలు. చిన సంపతిపురంలో రూ.10 లక్షలతో 20 వేల లీటర్ల కొత్త వాటర్ ట్యాంకు, రూ.6 లక్షలతో ఇంటింటి కుళాయి పైపులైన్లు. సత్యానగర్ కాలనీలో రూ.3 లక్షలతో పైపులైన్లు, ఇంటింటి కుళాయిలు.

తారు రోడ్లు:

జంగాలపాలెం కె.బి. రోడ్డు నుండి మరిడిమాంబ గుడి వరకు రూ.70 లక్షలతో 2 వంతెనలతో తారురోడ్డు, సైడ్ వాల్ మరియు సి.సి. రోడ్డు. తమ్మయ్యపేటలో రూ.1 కోటి 46 లక్షల ఆర్.డి.ఎఫ్ నిధులతో 4200 మీటర్ల తారురోడ్డు, 2 వంతెనలు, 2 చిన్న మధుములు, 6 సిమెంటు సవతాల వార్స్. తమ్మయ్యపేటలో రూ.25 లక్షల 13వ ఆర్థిక సంఘం నిధులతో 1500 మీటర్ల తారురోడ్డు.

సిమెంట్ రోడ్లు:

సంపతిపురం ఎస్.సి. కాలనీలో రూ.20 లక్షలతో 7 వీధులకు 700 మీటర్ల సి.సి. రోడ్డు, రూ.4 లక్షలతో 100 మీటర్లు, రూ.6 లక్షలతో 150 మీటర్లు, రూ.4 లక్షలతో 100 మీటర్లు. తమ్మయ్యపేటలో రూ.15 లక్షలతో 200 మీటర్లు, రూ.5 లక్షలతో 150 మీటర్లు, రూ.5 లక్షలతో 120 మీటర్లు, 7 వీధులకు రూ.12 లక్షలతో సి.సి. రోడ్లు. చిన సంపతిపురంలో రూ.8 లక్షలతో 200 మీటర్లు, రూ.2 లక్షలతో సి.సి. రోడ్డు, రూ.40 లక్షలతో మరిడిమాంబ గుడి నుండి ఆశ్రమం రోడ్డు వరకు 950 మీటర్ల సి.సి. రోడ్డు. చిన సంపతిపురంలో రూ.6 లక్షలతో పాము సూరిబాబు ఇంటి నుండి మరిడిమాంబ గుడి వరకు 150 మీటర్లు. సత్యానగర్ కాలనీలో రూ.8 లక్షలతో 200 మీటర్ల సి.సి. మెయిన్ రోడ్డు, రూ.12 లక్షలతో కొండపైన 8 వీధులకు 300 మీటర్లు, రూ.15 లక్షలతో మెయిన్ రోడ్డు నుండి ఆశ్రమం వరకు 400 మీటర్ల సి.సి. రోడ్డు. అలాగే రూ.1 కోటి 96 లక్షలతో సంపతిపురం నుండి కసింకోట వరకు సి.సి. రోడ్డు, రూ.20 లక్షలతో తమ్మయ్యపేట మరిడిమాంబ గుడి దగ్గర సి.సి. రోడ్డు, రూ.6 లక్షలతో చిన్న సంపతిపురం రోడ్డు, రూ.5 లక్షలతో ఎస్సీ కాలనీ రోడ్డు.

గ్రావెల్ రోడ్లు:

సంపతిపురం నుండి జంగాలపాలెం కె.బి. రోడ్డు వరకు రూ.10 లక్షలతో, మునాసుల రాజు ఇంటి నుండి స్మశానం వరకు రూ.3 లక్షలతో, కోన వరలక్ష్మి పాక నుండి చాకలి గరువు గుండా జంగాలపాలెం రోడ్డు వరకు రూ.2 లక్షలతో గ్రావెల్ రోడ్లు. తమ్మయ్యపేటలో రూ.49 లక్షల ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ నిధులతో పరమటమ్మతల్లి లోపకి, రూ.6 లక్షలతో స్కూలు నుండి స్మశానం వరకు గ్రావెల్ రోడ్లు. చిన సంపతిపురంలో రూ.3 లక్షలతో మరిడిమాంబ గుడి నుండి ఆశ్రమం వరకు గ్రావెల్ రోడ్డు.

డ్రైనేజీలు, చెక్ డ్యాములు:

తమ్మయ్యపేటలో రూ.3 లక్షల 50 వేలతో సి.సి. డ్రైనేజీ, రూ.3 లక్షలతో కాలపు వాలు డ్రైనేజీ. చిన సంపతిపురంలో రూ.2 లక్షలతో కె.బి. రోడ్డు వినాయక గుడి వద్ద నుండి ముప్పిన శ్రీను ఇంటి వరకు గెడ్డకు సి.సి. వాల్. తమ్మయ్యపేటలో రూ.27 లక్షలతో 6 చోట్ల చెక్ డ్యాములు, రూ.5 లక్షలతో పడమటమ్మ, జేపాటి, దుర్గాలమ్మ, విస్సన్నపేట గెడ్డలకు 1800, 800, 1200, 500 మీటర్ల వరకు చెత్త తీసి గట్లు వేయడం. సంపతిపురంలో రూ.4 లక్షలతో ఎర్ర చెరువు గట్టు పటిష్టం, మొక్కలు వేయించి, జంగిల్ క్లియరెన్స్ చేసి, స్మశానానికి గ్రావెల్ రోడ్డు. రూ.10 లక్షలతో ఫెర్రో కంపెనీ దగ్గర నుండి శీనురెడ్డి గడ్డ వరకు సి.సి. డ్రైన్.

విద్యుత్:

పంచాయతీలో 6 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, 4 హైమాక్స్ లైటింగ్ స్తంభాలు, వీధులకు కొత్త స్తంభాలు, వైర్లు, 250 ఎల్.ఇ.డి. లైట్లు అమర్చడం. పొలాల మధ్యలో స్తంభాలు తీయించి రోడ్డు ప్రక్కల 250 కొత్త స్తంభాలను వేయించడం జరిగింది.

ఆలయాలు, ఇతర అభివృద్ధి:

రూ.30 లక్షలతో తమ్మయ్యపేట మరిడిమాంబ గుడి, రూ.15 లక్షలతో సంపతిపురం పరమటమ్మ తల్లి ఆర్చి, రూ.8 లక్షలతో ఆంజనేయస్వామి గుడి. సంపతిపురం, చినసంపతిపురం, తమ్మయ్యపేట గ్రామాల్లో స్మశాన వాటికలలో రూ.4 లక్షలతో నాలుగు హ్యాండ్ బోర్లు.

సంక్షేమ కార్యక్రమాలు:

164 మందికి పెన్షన్, 200 కుటుంబాలకు రేషన్ కార్డులు, 180 మందికి గ్యాస్ కనెక్షన్లు, 350కి పైగా కొత్త ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ కార్డులు, పనివారికి ఉచితంగా పనిముట్లు. హుదూద్ తుఫాను నష్టపరిహారంగా 2 కోట్ల రూపాయలు, 260 మరుగుదొడ్లు, 84 హౌసింగ్ స్కీములు, 140 మంది పిల్లలకు ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్, బీమా కార్డులు, 5 లక్షల వరకు సి.ఎం. రిలీఫ్ ఫండ్. 32 డ్వాక్రా గ్రూపులకు 4 కోట్ల రూపాయల వరకు లోన్లు, 400 మంది డ్వాక్రా మహిళలకు 20 వేల చొప్పున 80 లక్షల రూపాయలు పసుపు, కుంకుమ చెక్కులు. రైతులకు అన్నదాత సుఖీభవ ద్వారా 40 లక్షల వరకు. తమ్మయ్యపేటలో 2017 అగ్నిప్రమాదంలో 32 పాకలు కాలిపోతే 25 కె.జి.ల బియ్యం, 8 వేల రూపాయలు చొప్పున 2 లక్షల 56 వేల రూపాయలు. 217/2, 190/2 సర్వే నెంబర్లలో 175 మందికి ఇంటి స్థలం పట్టాలు. అలాగే 72 మందికి కొత్త పింఛన్లు, 600 మందికి కొత్త రేషన్ స్మార్ట్ కార్డులు, 356 జాబ్ కార్డుల ద్వారా ఉపాధి పనులు.

విజయం అనంతరం అభిమానులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున విజేతను పూలమాలలతో సత్కరించి, శాలువాతో ఘనంగా సన్మానించారు. తెలుగుదేశం పార్టీ జెండాలతో గ్రామంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

నాలుగోసారి గెలిపించిన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు - సర్పంచ్ నంబారి శ్రీను

ఈ సందర్భంగా సర్పంచ్ నంబారి శ్రీను మాట్లాడుతూ, సంపతిపురం పంచాయతీ ప్రజలు తనను తమ ఇంటి బిడ్డలా ఆదరించి, తనపై అపారమైన నమ్మకంతో వరుసగా భారీ మెజారిటీతో 4వ సారి సంపతిపురం సర్పంచ్‌గా గెలిపించి, తనకు ప్రజాసేవ చేసే మహద్భాగ్యాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. తనకు అండగా నిలిచిన పెద్దలకు, అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, తన గెలుపు కోసం శ్రమించిన యువతకు, శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నా విజయం కోసం ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సహాయ సహకారాలు అందించిన ప్రజలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. "ప్రజల నమ్మకమే మా బలం" అని పేర్కొన్న ఆయన, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మన సంపతిపురం అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మనస్ఫూర్తిగా మాట ఇస్తున్నానని తెలిపారు.