BREAKING
టెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్.. పార్టీ కష్టకాలంలో వెన్నంటి నిలిచిన యువనేత ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏసిపి లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలి ఎస్ ఆర్ కె పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం ధర్మసాగర్ గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు

వరద నష్టపరిహారం నమోదుల్లో అక్రమాలా? క్షేత్రస్థాయి పూర్తి పరిశీలన లేకుండానే అంచనాలంటూ రైతు ఆరోపణ!*

Select Suryaa Now
వరద నష్టపరిహారం నమోదుల్లో అక్రమాలా? క్షేత్రస్థాయి పూర్తి పరిశీలన లేకుండానే అంచనాలంటూ రైతు ఆరోపణ!*

హిరమండలం, నవంబర్ 13 (మేజర్ న్యూస్):

తుఫాన్లు, వరదల కారణంగా పంట నష్టానికి గురైన రైతులకు ప్రభుత్వం పారదర్శకంగా నష్టపరిహారం అందించాల్సి ఉండగా, హిరమండలం మండలం గులుమూరు రెవెన్యూ గ్రామ పరిధిలో పంట నష్టం అంచనాల నమోదుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2026లో అర్ణబ్‌ తుఫాను కారణంగా వరద ముంపునకు గురైన వరి పంటలకు నష్టపరిహారం మంజూరు చేసే ప్రక్రియలో సంబంధిత వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించకుండానే సచివాలయంలో కూర్చొని ఇష్టానుసారంగా అంచనాలు నమోదు చేశారని గులుమూరుకు చెందిన రైతు గొర్రె బాలరాజు ఆరోపించారు. వాస్తవంగా పంట నష్టం జరగని భూములకు సైతం నష్టం జరిగినట్లు నమోదు చేసి పరిహారం మంజూరు చేసినట్లు తన దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని మండల వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకెళ్లగా, క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాల్సిన అవసరం లేదన్నట్లుగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా 2025లో వచ్చిన తుఫాను, వరదల సమయంలోనూ వరద ముంపునకు గురికాని సుమారు 70 నుంచి 80 ఎకరాల భూములకు పంట నష్టం జరిగినట్లు తప్పుగా నమోదు చేశారని, టేకు తోటలను సైతం వరి పంటలుగా చూపించడంతో పాటు సాగులో లేని భూములను కూడా వరి చేలుగా నమోదు చేశారని ఆయన ఆరోపించారు. అప్పట్లో ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా, తప్పులు జరిగినట్లు సంబంధిత అధికారులు అంగీకరించి, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అయినప్పటికీ ప్రస్తుత సంవత్సరం కూడా అదే తరహా తప్పిదాలు కొనసాగుతున్నాయని ఆయన విమర్శించారు. పంట నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి వాస్తవ పరిస్థితుల ఆధారంగా నమోదు చేయాల్సిన అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించకపోతే నిజంగా నష్టపోయిన రైతులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులు అర్హులైన రైతులకే అందేలా పారదర్శకత పాటించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా పంట నష్టం అంచనాలు రూపొందించినట్లు వస్తున్న ఆరోపణలపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని గొర్రె బాలరాజు డిమాండ్‌ చేశారు. గులుమూరు గ్రామ పరిధిలో 2025, 2026 సంవత్సరాలకు సంబంధించిన పంట నష్టం నమోదులను సమగ్రంగా పరిశీలించి, వాస్తవ సాగు విస్తీర్ణం, పంటల వివరాలు, వరద ముంపు ఆధారాలను తనిఖీ చేయాలని, తప్పులు లేదా అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులైన అధికారులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అర్హులైన రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.