BREAKING
ఖండవల్లిలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి ఇంటింటా ఎన్నికల ప్రచారం రూ.195 కోట్లతో నిడదవోలు పట్టణాభివృద్ధి:మంత్రి కందుల దుర్గేష్ ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు పందలపాక విద్యార్థులు ఎంపిక జనసేన పార్టీ నుండి వైయస్సార్ పార్టీలో చేరికలు నేటి పంచాంగం 26 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –26 అక్టోబర్ 2026 అంబాజీపేటలో శ్రీ విజయ భేతాళస్వామి వాహన మహోత్సవం.. గుగులోతు రామస్వామి నాయక్ కు ఘన సన్మానం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి-డిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

వైసిపి మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన..

Select Suryaa Now
వైసిపి మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన..

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   నెల్లూరు మండపాల వీధి లో  వైస్సార్సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. వైసిపి మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి,61వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి వేలూరు ఉమా మహేష్, 59వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి చీదెళ్ళ కిషన్ గార్లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ముందుగా  జైన్ టెంపుల్ ను సందర్శించి.. భగవంతుడికి ప్రత్యేక పూజలు చేశారు.  అనంతరం మండపాల వీధి కాపువీధి, ప్రాంతాల్లో పలు వాణిజ్య దుకాణాలకు వెళ్లి.. పార్టీ కరపత్రాలు పంపిణీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నవంబర్ 1న జరగబోయే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో.   ప్రజలు ఫ్యాను గుర్తుకు ఓటు వేసి .    మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి ని , 61వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి వేలూరు ఉమా మహేష్ ని, 59వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి చిదెళ్ళ కిషన్ ని.  గెలిపించాలని కోరారు.  ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే.. వైసిపి అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని  పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కోరారు.   ఈ ప్రాంతంలో వ్యాపారస్తులకు ఏ కష్టం వచ్చినా..మొదట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అండగా నిలుస్తుందన్నారు.   ప్రజలకు మంచి చేసేందుకు ముందుకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను జైన్ సోదరులు ఆశీర్వదించి.. గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.  ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.