వైసీపీ నుంచి టీడీపీలోకి 200 కుటుంబాలు చేరిక •జరుబులవారిపాలెం ఎస్సీ కాలనీ నుంచి టీడీపీలోకి
పర్చూరు, మేజర్‌న్యూస్ :
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. జరుబులవారిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన ఆయా కుటుంబాల సభ్యులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. జరుబులవారిపాలెం ఎస్సీ కాలనీ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
టీడీపీలో చేరిన వారిలో.. కొణిదల సామేలు, కొణిదల పేరయ్య, కొణిదెల పాల సుధాకర్, కొణిదల చిన్న, కొణిదెల యేసయ్య, కొణిదల కాలేబు, గోగులమూడి నాగయ్య, బండారు అశోక్, బండారు అక్కారావు, పులివర్తి యానాది, పులివర్తి సంగీతరావు, మాదాసు చెంచు రామారావు, మాదాసు భూషణం, మాదాసు యేసయ్య, బొనిగల రమణయ్య, బొనిగల నాగేశ్వరరావు, బొనిగల జాన్సన్, బొనిగల చిన్న రమణయ్య, బొనిగల వలసయ్య, గోగులమూడి సుబ్బారావు, గోగులమూడి ఏసోబు, గోగులమూడి సుధాకర్ రావు, దామవరపు వెంకట సుబ్బారావు, బేతాళ సుబ్బారావు, బేతాళ సంసారం, బేతాళ మరి, దాసు గంగాధర్, బండారు ఆశీర్వాదం, బండారి వెంకట్రావు, బండారు ప్రసంగి, గోగులమూడి దుర్గయ్య, గోగులమూడి ఎలేష్, మాదాసు యేసయ్య, కేతమాల విమల్ రాజ్, గోగులమూడి ఏలియా తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తోటకూరి హనుమయ్య, నాయకులు హరిప్రసాద్, కొసరాజు సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.