ఉప్పూడి సర్పంచ్‌గా కుంభ పూర్ణయ్య ఏకగ్రీవ ఎన్నిక ఉప సర్పంచ్‌గా మందపాటి బాలయ్య ఎంపిక.. నూతన ప్రజాప్రతినిధులకు అనగాని శివప్రసాద్ అభినందనలు
రేపల్లె, మేజర్ న్యూస్;
రేపల్లె మండలం ఉప్పూడి గ్రామ పంచాయతీలో 2026 సర్పంచ్ ఎన్నికల్లో కుంభ పూర్ణయ్య సర్పంచ్‌గా, చిన్న అరవపల్లి గ్రామానికి చెందిన మందపాటి బాలయ్య ఉప సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు రేపల్లెలోని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ అనగాని శివప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా అనగాని శివప్రసాద్ నూతన సర్పంచ్ కుంభ పూర్ణయ్య, ఉప సర్పంచ్ మందపాటి బాలయ్యలకు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. గ్రామ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని ఆకాంక్షించారు.
గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారానికి నూతన పాలకవర్గం ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తెనాలి సుమన్ (బాబీ), వేపూరి శ్రీనివాసరావు, కేసన రామకృష్ణ గౌడ్‌తో పాటు ఉప్పూడి గ్రామానికి చెందిన పలువురు ప్రజలు పాల్గొన్నారు.