ఉద్యోగమేళా కరపత్రాలు ఆవిష్కరణ
టి.నరసాపురం, సూర్య న్యూస్: ఈనెల 13న బొర్రంపాలెంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహించే జాబు మేళాకు సంబంధించిన కర పత్రాలను నిర్వాహకులు చల్లా వెంకట్రావు, బోడాల వెంకటు స్థానిక యువతతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 16కంపెనీల్లో సుమారు 600ల ఉద్యోగాలు ఉన్నాయన్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ, ఫార్మసీ తదితర విద్యార్హతలు కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశం వినియోగించుకోవాలని వారు కోరారు.
పసుమర్తి రాము జిల్లా ఇంచార్జ్ ఏలూరు