తిరుమలలో శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు: సర్వదర్శనానికి 20 గంటల సమయం!
తిరుమల :తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు పూర్తిస్థాయిలో నిండిపోయి, వెలుపల శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు.
టోకెన్లు లేని సాధారణ భక్తులకు స్వామివారి సర్వదర్శనం లభించడానికి ప్రస్తుతం సుమారు 20 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే మొత్తం 83,609 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 24,816 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే, నిన్న స్వామివారి హుండీ ద్వారా రూ. 3.95 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు అందుబాటులో ఉంచుతున్నారు.