L3 జాబితాతో ఇందిరమ్మ లబ్ధిదారులకు తిప్పలు! సర్వే తప్పిదాలతో అర్హులకు అన్యాయం.. కరువైన అధికారుల పర్యవేక్షణ! హుస్నాబాద్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన పేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. సొంత ఇల్లు లేని పలువురి పేర్లు సైతం సర్వేలో ఇల్లు ఉన్నట్లు నమోదు క
L3 జాబితాతో ఇందిరమ్మ లబ్ధిదారులకు తిప్పలు!
సర్వే తప్పిదాలతో అర్హులకు అన్యాయం.. కరువైన అధికారుల పర్యవేక్షణ!
హుస్నాబాద్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన పేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. సొంత ఇల్లు లేని పలువురి పేర్లు సైతం సర్వేలో ఇల్లు ఉన్నట్లు నమోదు కావడంతో L3 జాబితాలో చేరినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థాయి ఇందిరమ్మ కమిటీలు అర్హులను గుర్తించి జాబితాలు పంపించినప్పటికీ సర్వేలో జరిగిన తప్పిదాలను సరిచేయడంలో అధికారుల పర్యవేక్షణ కొరవడిందని ఆరోపిస్తున్నారు. L3 నుంచి L1 జాబితాలోకి పేర్లు మార్చించుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో సమగ్ర పునఃపరిశీలన చేపట్టి, సర్వే తప్పిదాలను సరిచేసి నిజమైన అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.