ఆపదలో ఉన్న కార్యకర్తకు ఎంవిఆర్ ఆర్థిక భరోసా
ప్రమాద బాధితుడు సూర్యారావు చికిత్సకు
రూ.25 వేల సాయం
అనకాపల్లి జిల్లా వుడేరు పంచాయతీ పరిధి లోని దిబ్బపాలెం గ్రామానికి చెందిన బీజేపీ సీని యర్ నాయకుడు కాండ్రేగుల సూర్యారావుకు బీజేపీ నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు (ఎంవిఆర్) ఆపన్నహస్తం అందించారు. గత నెలలో జరిగిన ప్రమాదంలో గాయపడిన సూర్యారావు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసు కున్న ఎం.వి.ఆర్ ఆయన కుటుంబాన్ని పరామ ర్శించి అండగా నిలిచారు ఈ సందర్భంగా సూర్యారావు ఆరోగ్య పరిస్థితి ని, కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య చికిత్సకు ఆర్థిక ఇబ్బం దులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో 25 వేల రూపాయల నగదు చెక్కును అందజేసి ఆర్థిక సహాయం చేశారు.కష్టకాలంలో తోటి నాయకులు, కార్యకర్తలకు అండగా నిలవడం, ఆపదలో ఉన్న కుటుంబాల కు ధైర్యం చెప్పడం తన బాధ్యతగా భావిస్తూ ఎంవిఆర్ ఈ సహాయం అందించడం స్థానికంగా అభినందనలు పొందింది. సేవా దృక్పథంతో మానవత్వానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్న ఎంవిఆర్ ను ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో ఎం.వి.ఆర్ యువసేన సభ్యు లు, తదితరులు పాల్గొన్నారు
రవికుమార్
జిల్లా ప్రతినిధి
NDP surya
అనకాపల్లి జిల్లా