BREAKING
రాజకీయ దురంధరుడు 'డోరతి' చిత్రంపై సంగీత్ ప్రతాప్ ప్రశంసల వర్షం జపాన్ ఆర్థిక మార్కెట్లలో భారీ పతనం భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో వన్డే...వర్షం ఆటంకం..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ 21 దేశాలకు అమెరికా ప్రయాణ నిషేధ హెచ్చరికలు తమిళనాడులోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో ఊపిరిపోక ముగ్గురు కార్మికులు మృతి కాలిఫోర్నియాలో బిలియనీర్ల పన్ను ప్రతిపాదన విఫలం నవంబర్ 12న రిటైల్ ద్రవ్యోల్బణం లెక్కలు: మార్కెట్ దృష్టి ఎమ్మా వాట్సన్ సాయం: లైంగిక వేధింపుల బాధితులకు అండగా నిలిచిన హాలీవుడ్ నటి! రూపాయికి దన్నుగా చమురు తగ్గుదల, విదేశీ నిధులు: రాయిటర్స్ లైంగిక కేసులలో దోషిగా రస్సెల్ బ్రాండ్: కేటీ పెర్రీ విడాకుల అసలు కారణాలు ఇవేనా? సరిహద్దు గోడ నిర్మాణానికి సుప్రీం అనుమతి: ట్రంప్‌కు ఊరట హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు: చమురు సరఫరాపై ఆందోళన నేడు కళ్యాణ్ జ్యువెలర్స్, ఎంఆర్ఎఫ్ సహా పలు కంపెనీల ఫలితాలు ఈజిప్టు పవన విద్యుత్ ప్రాజెక్టులకు 436 మిలియన్ డాలర్ల నిధులు

కమ్మ సామాజిక వర్గానికి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలి : కూటమి విజయ పరంపరలో వారి పాత్ర ద్విగుణీకృతం : తెలుగుదేశం యువనేత నాగూర్ వలి విజ్ఞప్తి

Select Suryaa Now
కమ్మ సామాజిక వర్గానికి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలి : కూటమి విజయ పరంపరలో వారి పాత్ర ద్విగుణీకృతం : తెలుగుదేశం యువనేత నాగూర్ వలి విజ్ఞప్తి

 

మదనపల్లి,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా,మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కమ్మ సామాజిక వర్గానికి కేటాయించాలని తెలుగుదేశం యువనేత,21వ వార్డు టిడిపి ఇంచార్జి నాగూర్ వలి (షో ఆప్ శీనా) పేర్కొన్నారు.సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు విశేష కృషి చేస్తున్నారన్నారు.2024లో తెలుగుదేశం,జనసేన,బిజెపి కూటమిగా ఏర్పడిన తర్వాత రిజర్వేషన్ ప్రాతిపదికన మదనపల్లి ఎమ్మెల్యే టికెట్ షాజహాన్ బాషాకి కేటాయించడం జరిగిందన్నారు.ఆయన గెలుపులో కమ్మవారు క్రియాశీలక పాత్ర పోషించారనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.అయితే ఇటీవల కాలంలో నామినేటెడ్ పదవులు కేటాయింపులో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు కాస్త అసంతృప్తిలో ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ,వారు పార్టీ ఆదేశాలను ఏనాడు జవదాటలేదన్నారు.అయితే ఇటీవల మదనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీరామ్ చినబాబుతోపాటు కూటమి అభ్యర్థులు అఖండ విజయం సాధించిన సంగతి విధితమే.ప్రస్తుతం మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిపై తీవ్ర పోటీ నెలకొంది.ఈ మున్సిపల్ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కొందరు కౌన్సిలర్లుగా విజయం సాధించారు.మాలో ఎవరికో ఒకరికి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి అప్పగిస్తే కూటమికి అదనపు బలం చేకూరుతుందనే వాదన వినిపిస్తున్నారన్నారు.వారు ఏనాడు పదవుల కోసం వెంపర్లాడలేదని,కేవలం ప్రజాసంక్షేమం,పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నారని గుర్తుచేశారు.కూటమి ధర్మం పాటిస్తూనే ఈ పదవిని వారికి అప్పగిస్తే సమతుల్యంగా ఉంటుందని తెలిపారు.మున్సిపల్,జడ్పిటిసి,ఎంపిటిసి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపు కోసం ఆ సామాజిక వర్గం వారు అహర్నిశలు శ్రమించారన్నారు.రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం,ఎన్నికల వ్యూహరచన చేసే సమర్ధత కలిగిన నాయకులు ఆ సామాజిక వర్గంలో మెండుగా ఉన్నారన్నారు.ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో చాలా మంది నేతలు సన్నిహితంగా ఉంటూ నియోజకవర్గం అభివృద్ధికి వారివంతు సహకారం అందిస్తున్నారన్నారు.మదనపల్లి నియోజకవర్గాన్ని టిడిపి కంచుకోటగా ముద్ర వేశారంటే వారి పాత్ర ఎంత గట్టిదో అర్థం చేసుకోవచ్చు.బిజెపి,జనసేన పార్టీల చెందిన కౌన్సిలర్లు మున్సిపల్ వైస్ చైర్మన్ రేసులో ఉన్నప్పటికీ భవిష్యత్తులో కూటమి అవకాశాలను మరింత బలపరుచుకోవడానికి కమ్మ సామాజిక వర్గానికి ఈ పదవి కేటాయిస్తే బాగుంటుందని,ఆ సామాజిక వర్గానికి న్యాయం చేసినట్లు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారని నాగూర్ వలి పేర్కొన్నారు.మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కమ్మ సామాజిక వర్గానికి కేటాయించి ఈసారైనా న్యాయం చేస్తారో లేదో మరి కొద్దిరోజుల్లో తెలిసిపోతుందన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి