దుబ్బిగానిపల్లె ఎంపీటీసీగా ఎస్.అమ్మాజీ ఘనవిజయం : శుభాకాంక్షలు తెలిపిన వైకాపా నాయకులు,కార్యకర్తలు
మదనపల్లె రూరల్,మేజర్ న్యూస్ : ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మదనపల్లి మండలం దుబ్బిగానిపల్లెలో వైఎస్ఆర్సిపి అభ్యర్థిని ఎస్.అమ్మాజీ ఘనవిజయం సాధించారు.దీంతో స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు,సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఎంపిటిసి ఎస్.అమ్మాజీ మాట్లాడుతూ నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికే వైకాపా అధినేత జగనన్న స్ఫూర్తితో,తన భర్త ఎస్.నాసీర్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి ప్రవేశించానన్నారు.దుబ్బిగానిపల్లి ఎంపీటీసీగా పార్టీ అధిష్టానం అవకాశం కల్పించగా ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు.గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జగనన్న అమలు చేసిన నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయని కొనియాడారు.ఆ పథకాలు ఇంకా ప్రజల మధ్యలో మెదులుతున్నాయన్నారు.ప్రజలకు అందుబాటులో ఉండి పంచాయతీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.తనకు అవకాశం కల్పించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి,ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,మదనపల్లి వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహ్మద్,మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి,మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి,నియోజకవర్గం పరిశీలకులు అనూష రెడ్డి,గెలుపుకు సహకరించిన స్థానిక నాయకులు,కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి