BREAKING
నెక్స్ట్ డీసీ కీలక నిర్ణయం: ఒప్పందాలు లేని ప్రాజెక్టులకు బ్రేక్ ఏపీ టూరిజానికి రెండు ప్రతిష్టాత్మక సిల్వర్ బనియన్ అవార్డులు బరువు తగ్గే ఔషధాలపై ఎఫ్‌డీఏ కీలక హెచ్చరిక: కంటి చూపు దెబ్బతినే ప్రమాదముందని లేబుల్ జారీ డొనాల్డ్ ట్రంప్‌తో ఖతార్ ప్రధాని కీలక భేటీ: పశ్చిమాసియా సంక్షోభంపై ముమ్మరమైన దౌత్య చర్చలు ఇస్కాన్ ఆధ్వర్యంలో నేడు గోవర్ధన పూజ గ్లోబల్ కాపర్ మార్కెట్‌లో తీవ్ర ఉత్కంఠ గ్లోబల్ మార్కెట్లలో కోలుకునే సంకేతాలు ప్రజలందరికీ ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన జీవితం కలగాలి గ్లోబల్ మార్కెట్లలో ఊరట..వాల్‌స్ట్రీట్ పుంజుకోవడంపై అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ ఘనంగా సీఎం, ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు పశ్చిమ పసిఫిక్‌లో చైనా దూకుడు..తైవాన్ హెచ్చరికలతో ఉద్రిక్తత డీసీ స్టూడియోస్ నుంచి తప్పుకున్న జేమ్స్ గన్, పీటర్ సాఫ్రాన్: కొత్త చీఫ్‌గా జెరెమీ లాట్చమ్ నియామకం పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల విడాకులు: పదమూడేళ్ల వైవాహిక బంధానికి ముగింపు ఇట్లు అర్జున మ్యూజికల్ కాన్సర్ట్‌లో రామ్ చరణ్, నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు: ప్రధాన నగరాల్లో తాజా రేట్ల వివరాలు ఇవే!

కళ్యాణదుర్గంలో కూరగాయల మార్కెట్ వద్ద పేరుకుపోయిన చెత్త.

Select Suryaa Now
కళ్యాణదుర్గంలో కూరగాయల మార్కెట్ వద్ద పేరుకుపోయిన చెత్త.

**కళ్యాణదుర్గం:** పట్టణంలోని రాయదుర్గం రహదారిలో ఉన్న కూరగాయల మార్కెట్ సమీపంలో చెత్త పేరుకుపోవడంతో పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. నిత్యం వందలాది మంది వ్యాపారులు, కొనుగోలుదారులు రాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో చెత్త తొలగింపు సక్రమంగా జరగకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మార్కెట్ పరిసరాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు దుర్వాసన వెదజల్లుతుండటంతో అటుగా వెళ్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూరగాయల మార్కెట్ కావడంతో ప్రతిరోజూ పెద్దఎత్తున వ్యర్థాలు వెలువడుతున్నప్పటికీ వాటిని ఎప్పటికప్పుడు తొలగించడంలో సంబంధిత పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెత్త కుప్పల కారణంగా దోమలు, ఈగలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అపరిశుభ్ర వాతావరణం కొనసాగితే పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలతో పాటు మార్కెట్‌కు వచ్చే వ్యాపారులు, వినియోగదారుల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ పరిసరాల్లో ప్రతిరోజూ చెత్త సేకరణ, తరలింపు చేపట్టడంతో పాటు అవసరమైన చోట చెత్త కుండీలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పేరుకుపోయిన చెత్తను తొలగించాలని, మార్కెట్ ప్రాంతంలో నిరంతర పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరుతున్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.