ఇస్కాన్ ఆధ్వర్యంలో నేడు గోవర్ధన పూజ
అహోబిలం ఇస్కాన్ ఆధ్వర్యంలో గోవర్ధన మహా పూజ…
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్; రుద్రవరంమండలంలోని హరి నగరం సమీపంలో వెలసిన అహోబిలం ఇస్కాన్ ఆధ్వర్యంలో కార్తీక మాసం పురస్కరించుకుని మంగళవారం అనగా నేడు గోవర్ధన మహా పూజ నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ టెంపుల్ ఇన్చార్జి చంద్రకేశవ దాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం నాడు గోవర్ధన మహా పూజ నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ప్రముఖంగా భక్తులచే కీర్తనలు గోవర్ధన లీల కథ ప్రవచనం, గోపూజ గోవర్ధన పూజ హారతి మరియు గిరి రాజ్ అభిషేకం వంటి విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వచ్చిన భక్తులకు మధ్యాహ్నం ఒంటిగంటకు మహా ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనదని ఈ సందర్భంగా ఇస్కాన్ టెంపుల్ ఇన్చార్జి చంద్రకేశవ దాస్ తెలిపారు. ఈ పవిత్రమైన గోవర్ధన పూజ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణుని కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. అలాగే గోవర్ధన పూజకు సహాయ సహకారాలు అందించగలిగే భక్తులు ఇస్కాన్ అహోబిలం సందర్శించి తగిన విరాళాలు అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా