ఎన్నికల నేపథ్యంలో రాజీవ్ కాలనీలో నాకాబందీ
ఎన్నికల నేపథ్యంలో రాజీవ్ కాలనీలో నాకాబందీ.ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.3 టౌన్ సీఐ కౌలుట్లయ్య…అనంతపురం జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు 3 టౌన్ సీఐ జి. కౌలుట్లయ్య ఆధ్వర్యంలో రాజీవ్ కాలనీలో పోలీసులు నాకాబందీ నిర్వహించారు. వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. ఓటర్లను బెదిరించడం, గొడవలకు దిగడం, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేయడం వంటి చర్యలకు పాల్పడరాదన్నారు. మద్యం, గంజాయి, డబ్బు పంపిణీ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా అత్యవసర సహాయ నంబర్ 112కు సమాచారం అందించాలని కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని సీఐ విజ్ఞప్తి చేశారు.