దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ విజయ రమణారావు
సూర్య సుల్తానాబాద్
రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని ఐకెపి, సింగిల్ విండో కేంద్రాలలో రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకొని ప్రభుత్వ మద్దతు ధర ఉంది 24 గంటల్లోనే డబ్బులు పొందాలని సూచించారు. మండలంలోని నరసయ్య పల్లె, బొంతగుంటపల్లె, గర్రెపల్లి, భూపతిపూర్ తదితర గ్రామాలలో ఏర్పాటుచేసిన సొసైటీ కేంద్రాలను ఎమ్మెల్యే పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారుల చేతిలో రైతులు మోసపోవద్దని రైతులు కల్లాల లో నుండి నేరుగా ధాన్యాన్ని సెంటర్ లోకి తీసుకువచ్చి అమ్ముకోవాలని సూచించారు. రైతులకు వరి ధాన్యం బోనస్ కూడా అందజేయడం జరుగుతుందన్నారు. రైతుల కొరకు సీఎం రేవంత్ రెడ్డి ఆహార్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్లు చిలుక సతీష్, కల్లేపల్లి జానీ, సర్పంచ్ వీరగోని రమేష్, దామోదరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.