రైలు ప్రమాదంలో నర్సింగాపూర్ వ్యక్తికి తీవ్ర గాయాలు.. వీణవంక
సూర్య వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన ఉయ్యాల కృష్ణ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం ప్రకారం.. సోమవారం కృష్ణ మంచిర్యాల వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో 08:00 బీజీ షరీఫ్ రైల్వే స్టేషన్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.రైల్వే ప్లాట్‌ఫాంపై కృష్ణ ఫోన్ కింద పడిపోవడంతో దాన్ని తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు రైల్వే ట్రాక్ వద్ద ఇరుక్కుపోయినట్లు తెలిసింది. ఈ ఘటనలో ఒక కాలు పూర్తిగా విరిగిపోగా, మరో కాలు పాదం వరకు తీవ్రంగా దెబ్బతిని కట్ అయినట్లు సమాచారం.
తీవ్రంగా గాయపడిన కృష్ణను తొలుత మెరుగైన వైద్యం కోసం వరంగల్‌కు తరలించారు. అనంతరం అక్కడి నుంచి కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది.
ఈ ఘటనతో నర్సింగాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. కృష్ణ ఆరోగ్య పరిస్థితి, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.