BREAKING
నా పెళ్లిలో షాహిద్ కపూర్‌ను స్టేజ్ పైనుంచి కిందకు నెట్టేసిన కరణ్ జోహార్: కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు షార్ట్ సర్క్యూట్‌తో వాటర్ ప్యూరిఫైయర్ పేలి .. దగ్ధమైన ఇల్లు ఎంపీపీ, జెడ్పీ అధ్యక్షుల పరోక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల గోదావరి పుష్కరాలు–2027 ఏర్పాట్లకు పక్కా ప్రణాళిక రూపొందించాలి రావణాసురుడి పాత్ర కోసం రాకింగ్ స్టార్ యష్ పడ్డ కష్టం: ఏకంగా 33 కేజీల బరువైన దుస్తులు! సీతాదేవి చేతిలో ఖడ్గం పటించడంపై విమర్శలు: సాయి పల్లవికి మద్దతుగా నిలిచిన నటి ఇందిరా కృష్ణన్ అనకాపల్లిలో వైభవంగా అయ్యప్ప పడిపూజ బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' రికార్డుల సునామీ: కేవలం 5 రోజుల్లోనే 660 కోట్లు దాటిన కలెక్షన్లు! డీసీ స్టూడియోస్ బాధ్యతల నుంచి తప్పుకోవడంపై స్పందించిన జేమ్స్ గన్: కార్పొరేట్ పద్ధతులు నచ్చలేదంటూ వ్యాఖ్యలు అయ్యప్ప స్వాములు, శివ స్వాములు, భవాని స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూత టీపీసీసీ అధికార ప్రతినిధుల నియామకాలపై స్టే డిఫరెంట్ స్టైల్‌లో సమంత మెటర్నిటీ ఫొటోషూట్: నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ పిక్! రామాయణం కవచాల వెనుక అసలు రహస్యం: మూడేళ్లపాటు కష్టపడిన అస్సాం చేతివృత్తి కళాకారులు! సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేసిన మండల యువజన అధ్యక్షుడు..

ధాన్యం కొనుగోళ్లపై ఎమ్మెల్యేఎమ్మెల్యే జోక్యం.. రైతులకు భరోసా!

Select Suryaa Now
ధాన్యం కొనుగోళ్లపై ఎమ్మెల్యేఎమ్మెల్యే జోక్యం.. రైతులకు భరోసా!

మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్:మిర్యాలగూడ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా రైతులకు తక్కువ ధర చెల్లిస్తున్నారనే ఆందోళనలపై ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) వెంటనే స్పందించారు. రైతులకు నష్టం జరగకుండా ధాన్యం క్వింటాల్‌కు కనీసం రూ.3,500 చొప్పున కొనుగోలు చేయాలని రైస్ మిల్లర్లకు స్పష్టమైన సూచనలు చేశారు.

ఈ మేరకు మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైతులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులు ఆర్థికంగా నష్టపోకుండా చూడాలని, క్వింటాల్‌కు రూ.3,500 కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయవద్దని మిల్లర్లకు సూచించారు.

అనంతరం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కర్నాటి రమేష్, బండారు కుశలయ్య మరియు అసోసియేషన   ప్రతినిధులు   మీడియా సమావేశం నిర్వహించి కీలక ప్రకటన చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని ప్రతి రైస్ మిల్లులో ధాన్యం క్వింటాల్‌కు రూ.3,500 తగ్గకుండా కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ధాన్యం నాణ్యత బాగుంటే రూ.3,500 కంటే ఎక్కువ ధర చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణయించిన ధర కంటే తక్కువకు కొనుగోలు చేయబోమని రైతులకు హామీ ఇచ్చారు.

రైతుల సమస్యలపై వెంటనే స్పందించి రైస్ మిల్లర్లతో చర్చలు జరిపి కనీస ధరపై హామీ ఇప్పించడంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తీసుకున్న చొరవపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.