అయ్యప్ప స్వాములు, శివ స్వాములు, భవాని స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
అయ్యప్ప స్వాములు, శివ స్వాములు, భవాని స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-జగ్గయ్యపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయంలో 34వ వార్డు కౌన్సిలర్ గింజుపల్లి కృష్ణ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొని అయ్యప్ప స్వాములకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించి, అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలో అయ్యప్ప స్వాముల ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొల్లి మార్షల్ స్టాలిన్ , 34వ వార్డు కౌన్సిలర్ గింజుపల్లి కృష్ణ అయ్యప్ప స్వాములు, భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ :-శివ జగ్గయ్యపేట నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా