andhrapradesh
కిర్లంపూడి పీఎస్‌లో గంటన్నర పాటు అంబటి విచారణ
కాకినాడ: దివంగత నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా పోలీసుల విధుల నిర్వహణకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై నమోదైన కేసులో వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కాకినాడ జిల్లా కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. నోటీసుల మేరకు విచారణకు వచ్చిన ఆయనను పోలీసులు దాదాపు గంటన్నర పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు.
విచారణ అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ... పోలీసులు తన్ను ఏదో తీవ్రవాదిని విచారించినట్లుగా ప్రశ్నలు అడిగారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముద్రగడ అంత్యక్రియల సమయంలో ప్రభుత్వ గౌరవ వందనం వద్దని ఆయన కుటుంబ సభ్యులే స్పష్టం చేశారని, తాము కేవలం వారి నిర్ణయాన్ని మాత్రమే గౌరవించామని తెలిపారు.