ఆర్ కే విద్యాలయానికి జాతీయ స్థాయి గుర్తింపు
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: నగరం లోని స్థానిక ఆర్కే విద్యాలయ జూనియర్ కళాశాల కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించిన 70వ జాతీయ పాఠశాల క్రీడా పోటీల్లో అండర్-17 టెన్నిస్ బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున చిత్తూరుకు చెందిన ఆర్.కే. విద్యాలయ విద్యార్థిని సుమైరా అన్సారీ సయ్యద్ లక్ష్యత ఉత్తమ ప్రతిభ కనబరిచి కాంస్య పతకాన్ని సాధించడం గర్వకారణమని ఆర్.కే. విద్యాలయ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం. రమేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు.దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పాల్గొన్న క్రీడాకారులతో పోటీపడి ఈ ఘనత సాధించడం అభినందనీయమని, పట్టుదల, క్రమశిక్షణకు నిదర్శనమని పేర్కొన్నారు. విద్యార్థుల చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా ఆర్.కే. విద్యా సంస్థలు నిరంతరం ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎం. రమేష్ బాబు మాట్లాడుతూ సుమైరా సాధించిన విజయం పాఠశాలకే కాదు, చిత్తూరు జిల్లాకే గర్వకారణమని తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలని తమ సంస్థ ఎప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు. సుమైరా క్రమశిక్షణ, పట్టుదల ఇతర విద్యార్థులకు ఆదర్శమన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. పాఠశాల యాజమాన్యం తరపున ఆమెకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పతకాన్ని అందుకున్న విద్యార్థినిని కళాశాల మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ కల్పజ అభినందించారు. అలాగే కళాశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు.
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.