మండల అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తా
చిట్టమూరు మేజర్ న్యూస్:చిట్టమూరు మండల తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం జెడ్పీటీసీ సభ్యురాలు పెళ్లూరు సౌజన్య రెడ్డితో పాటు విజయం సాధించిన ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యుల విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులు,కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం గెలుపొందిన ప్రజాప్రతినిధులను పలువురు పూలమాలలు,శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యురాలు పెళ్లూరు సౌజన్య రెడ్డి మాట్లాడుతూ..తనపై నమ్మకంతో జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన పెద్దలు కొండేపాటి గంగప్రసాద్‌కు,స్థానిక ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్‌కు, తన విజయానికి అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ గణపర్తి కిషోర్ నాయుడు,మండల నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆయా పంచాయతీల నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు శ్రమించి తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్క ఓటరుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.పార్టీని మరింత బలోపేతం చేస్తూ నాయకులు, కార్యకర్తలందరినీ కలుపుకొని ముందుకు సాగుతామన్నారు. ప్రతి ఎన్నికను సమర్థవంతంగా ఎదుర్కొని పార్టీ అన్ని స్థానాల్లో విజయాలు సాధించేలా కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్‌చార్జి మారంరెడ్డి జనార్దన్ రెడ్డి,చిట్టమూరు పీఏసీఎస్ అధ్యక్షులు గుండుబోయిన కస్తూరయ్య యాదవ్,మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షేక్ రషీద్,పార్టీ సీనియర్ నాయకులు వెదనపర్తి రాజగోపాల్ రెడ్డి, గోపాల్ నాయుడు,మేరిగల మధుసూదన్ యాదవ్, నల్లారెడ్డి రాజేష్ రెడ్డి,దొడ్డగ వెంకట రమణయ్య,పఠాన్ బషీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానుల ఆనందోత్సాహాల మధ్య విజయోత్సవ సంబరాలను జరుపుకున్నారు.
అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్