కె. పేట సొగసు చూడ తరమా
నందవరం, సూర్య ప్రతినిధి
నందవరం మండలంలోని కనకవీడు పేట గ్రామ ప్రధాన రహదారి మురికి కోపంగా మారింది.. వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తుంది.. పిల్లలనుంచి వచ్చిన మురుగునీరు అంట రోడ్లపై నిలిచి దోమల పెంటగా మారింది.. 2021 సర్పంచ్ ఎన్నికల వరకు కనకవీరు మజార గ్రామంలో ఉన్న కే పేట 2021లో కొత్త గ్రామ పంచాయతీగా రూపాంతరం చెందిన పేట గ్రామస్తులకు ఇక్కట్లు తప్పలేదు.. ఆ ఎన్నికల్లో అటు తెలుగుదేశం ఇటు వైసిపి బలపరిచిన సర్పంచుల అభ్యర్థులు కాకుండా వైసిపి రెబల్ అభ్యర్థి తొలి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అప్పటి వైకాపా నాయకులు ఆయనని దరి చేరినీ య్యకపోవడంతో అప్పట్లో టీడీపీ గుటికీ చేరుకున్నారు.. 2021 ఏడాదిలో గ్రామపంచాయతీ కొత్త సర్పంచ్ వచ్చినా కూడా ఏడు ఏళ్లుగా ఆ గ్రామం అభివృద్ధికి ఎక్కడ నోచుకోలేదు.. టిడిపి అధికారంలోకి వచ్చి మూడేళ్లయిన ఆ గ్రామ పెద్ద ఊరు గురించి పట్టించుకోలేదని నిన్న మొన్న జరిగిన ఎంపిటిసి జడ్పిటిసి ఎలక్షన్లో నందవరం మండలంలో గెలిచిన ఒకే ఒక వైకాపా సీటు కే. పేటది కావడం విశేషం. కనకవీడు పేట గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో అధికారుల సైతం చిన్న చూపు చూశారని చెప్పడానికి ఈ రహదారే ఓ నిదర్శనం..
శరత్ కుమార్ సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా