telangana
కిష్టాపూర్ లో వీబీజీ రాంజీ పనులను ప్రారంభించిన సర్పంచ్
సూర్య, జన్నారం : జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామ పంచాయతీలో వీబీజీ రాంజీ అభివృద్ధి పనులను బుధవారం స్థానిక సర్పంచ్ వాసాల నరేష్, ఉపసర్పంచ్ కోల దేవపాల కుమార్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వాసాల నరేష్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ఏ విధంగా ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగా గ్రామంలో ఉన్న కూలీలకు సైతం పని కల్పించినట్లు అవుతుందని అన్నారు. అంచలంచలుగా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయుటకు కృషి చేస్తానన్నారు. పంచాయితీ పాలకవర్గంతో పాటు గ్రామ ప్రజల సహకారంతో గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు. త్వరలో మరిన్ని అభివృద్ధి పనులను ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ముంజంపల్లి సాయికుమార్, బోడ గోవింద్, పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ నయీం, ఫీల్డ్ అసిస్టెంట్ వేణు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.