*మధిర లో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం!*
మధిర, సూర్య మేజర్ న్యూస్.
స్వతంత్ర భారతదేశపు తొలి విద్యా శాఖామాత్యులు, భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతిని పురస్కరించుకుని మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ముందుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. రవీంద్రారెడ్డి అధ్యక్షతన వైస్ ప్రిన్సిపాల్ జి. అరుణ మరియు అధ్యాపకులు మౌలానా ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎం. రవీంద్రారెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారన్నారు. విద్యారంగ అభివృద్ధికి ఆయన అందించిన సేవలను స్మరించుకోవడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు.దేశ భవిష్యత్తును రూపొందించడంలో, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో విద్య ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. నైపుణ్యంతో కూడిన చదువుల ద్వారానే మానవాభివృద్ధి తద్వారా దేశాభివృద్ధి సాధ్యమవుతాయి. అందుకే దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ప్రభుత్వాలు చదువుకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, అందరూ విద్యను అభ్యసించేలా ప్రోత్సహిస్తున్నాయన్నారు భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈ పదవిలో చాలా కాలం పనిచేసి దేశంలో విద్యాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టి న ఆయన జయంతిని పురస్కరించుకుని మన దేశంలో ఏటా నవంబరు 11న 'జాతీయ విద్యా దినోత్సవం'గా నిర్వహించుకోవడం ఆనవాతిగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఎస్ ఇందిరా డాక్టర్ పి సుజాత డాక్టర్ వి నాగరాజ్ మరియు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు