BREAKING
కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలి - సిపిఐ నాయకులు డిమాండ్ మేజర్ పంచాయితీ మనదే కావాలి... * మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ * ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయం - కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సిరాజ్ హుస్సేన్ గాంధీ కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు: కంగనా రనౌత్ ఆరోపణలతో రాజకీయ కలకలం మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం - కలెక్టర్ చిత్రా మిశ్రా మెగాస్టార్ 'విశ్వంభర' డబ్బింగ్ అప్‌డేట్.. త్వరలోనే థియేటర్లలోకి సోషియో ఫాంటసీ వండర్! పిల్లల్లో భాష నైపుణ్యాలను పెంపొందించాలి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138 జయంతి వేడుకలు పరిషత్ పోరులో కీలక ఘట్టం.. ఎంపీపీ ఎన్నికకు వేళాయే సుడిగాలి సుధీర్ 'గోట్' సినిమా వేదికపై కన్నీటి పర్యూమంతమైన హీరోయిన్ దివ్యభారతి.. అసలు ఏం జరిగిందంటే! చిరు వ్యాపారులపై నోటీసుల పేరుతో వేధింపులా? మండల పరిషత్ "వైస్ ఎంపీపీ"గా అంబటి రాంబాబు? ఇల్లందకుంటలో ఉచిత AI (ఏఐ) శిక్షణ కేంద్రం ప్రారంభం ఆ విజయం పెంచిన బాధ్యతతో వస్తున్నాం.. 'డీఎన్కే' సినిమాపై మౌళి తనూజ్ ప్రశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు! పారమ్మకొండకు పర్యాటక కళ తీసుకొస్తాం

పరిపాలనలో పారదర్శకతకు సమాచార హక్కు చట్టం కీలకం

Select Suryaa Now
పరిపాలనలో పారదర్శకతకు సమాచార హక్కు చట్టం కీలకం

మెదక్, మేజర్ న్యూస్ ప్రతినిధి : ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకతను పెంపొందించడంతో పాటు ప్రజలకు ప్రభుత్వ కార్యకలాపాలపై సమాచారం పొందే హక్కును కల్పించడంలో సమాచార హక్కు చట్టం – 2005 కీలక పాత్ర పోషిస్తుందని మెదక్ జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ అన్నారు.బుధవారం మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై జిల్లా స్థాయి ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులు, ఇతర అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రభుత్వ శాఖల్లో జవాబుదారీతనాన్ని పెంచడంతో పాటు ప్రజలకు పాలనపై నమ్మకాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. చట్ట నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులకు సాధారణంగా 30 రోజుల్లోగా కోరిన సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుందని వివరించారు.ప్రతి అధికారి సమాచార హక్కు చట్టంలోని నిబంధనలు, విధివిధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ, వాటి పరిష్కార ప్రక్రియ, సమాచారం అందించే గడువులు, పౌరుల హక్కులు, అధికారుల బాధ్యతలపై శిక్షణలో వివరంగా అవగాహన కల్పించారు.సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం మరింత బలోపేతం అవుతాయని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో శంకర్‌తో పాటు ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.