ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వినతి
మహేశ్వరం, మేజర్ న్యూస్ : మహేశ్వరం డిపోలో ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఉద్యోగులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా చూడాలని కోరుతూ మహేశ్వరం డిపో మేనేజర్ కి మహేశ్వరం నియోజకవర్గ ఐఎన్ టియుసి కార్మిక శాఖ అధ్యక్షులు నడికుడ శివ ఆధ్వర్యంలో మహేశ్వరం డిపో టిడబ్ల్యూయు అధ్యక్షులు కృష్ణ గౌడ్, షరీఫ్ ఖాన్‌తో కలసి వివిధ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కార్మికుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా.. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా.. ఐఎన్ టియుసి ఎల్లప్పుడూ కార్మికులకు అండగా నిలుస్తుందని అన్నారు.
పాల జనార్ధన్, మేజర్ న్యూస్, మహేశ్వరం, రంగారెడ్డి జిల్లా