BREAKING
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: భారీ పరిశ్రమలు, డేటా సెంటర్లకు ఆమోదం ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం.. పలమనేరు అభివృద్ధే లక్ష్యం 2 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు కసరత్తు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చిట్టమూరులో పోషణ్ శిక్షణ కార్యక్రమం టెంపో ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి హైదరాబాద్‌లో క్లౌడ్ కిచెన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తోబుట్టువుల అనుబంధాల పండుగ మహతీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భిణీలకు పౌష్టిక ఆహారంపంపిణి గీతా కార్మికుల పాలిట శ్రీరామ రక్ష కాటమయ్య రక్షణ కిట్లు వాడీవేడిగా మండల స్థాయి సమీక్ష సమావేశం విజయ్ ఆంటోని 'అప్ప కుట్టి' ప్రెస్‌మీట్: చెన్నై వేదికగా సినిమా విశేషాలు పంచుకున్న చిత్ర యూనిట్ రంగారెడ్డిని కరువు జిల్లాగా ప్రకటించాలి శబరిమల అయ్యప్ప భక్తులకు ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరి 'ఇట్లు అర్జున' వేదికపై రామ్ చరణ్ వ్యాఖ్యలు: సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై ట్రెండింగ్! రాజకీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య: అసలు విషయం చెప్పిన నటుడు!

రంగారెడ్డిని కరువు జిల్లాగా ప్రకటించాలి

Select Suryaa Now
రంగారెడ్డిని కరువు జిల్లాగా ప్రకటించాలి

రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి.. పేద కుటుంబాలకు ఆహార సరుకులు, పశువులకు పశుగ్రాసం అందించాలి - సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్

(రంగారెడ్డి - మేజర్ న్యూస్) : ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని, కరువు ఛాయలు అలుముకున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు, పేద ప్రజలను ఆదుకునేందుకు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.

మంగళవారం సిపిఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాకు అధ్యక్షత వహించిన జంగయ్య మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయని, రైతులు సాగు చేసిన ఆహార, వాణిజ్య పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన రైతాంగాన్ని, ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి యుద్ధప్రాతిపదికన కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పశువులకు ఉచితంగా పశుగ్రాసం సరఫరా చేయాలని, కరువు పరిస్థితుల్లో పేద కుటుంబాలు ఇబ్బందులు పడకుండా ప్రతి కుటుంబానికి 10 కిలోల రేషన్ బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందించాలని కోరారు. ఎండిపోయిన మొక్కజొన్నతో పాటు ఇతర వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.30 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్రాచారి, మాజీ జిల్లా కార్యదర్శి పుస్తకాల నర్సింగ్‌రావు, రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు, ఓరుగంటి యాదయ్య, కే. రామస్వామి, ముత్యాల యాదిరెడ్డి, ఎండీ పైమీద, బుద్ధుల జంగయ్య, టి. రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ.. రానున్న ఆరు నెలల పాటు కరువు ప్రభావిత ప్రజలకు ప్రభుత్వాలు అండగా నిలిచి ఆదుకోవాలని కోరారు.

అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సామెడి శేఖర్‌రెడ్డి, ఎం. ప్రవలింగం, పల్నాటి యాదయ్య, ఆర్. యాదగిరి, వడ్ల సత్యనారాయణ, నీలమ్మ, పి. శివకుమార్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తు నాయక్, రైతు సంఘం అధ్యక్షుడు మాధవరెడ్డి, మండల కార్యదర్శులు సత్తిరెడ్డి, హరిసింగ్ నాయక్, కే. రాజు, కే. శ్రీనివాస్, డీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, కావలి సురేష్, వెంకటేష్, బి. నరసింహులు, ఎండీ షకీల్, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సక్రు నాయక్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మధు తదితరులు పాల్గొన్నారు.