BREAKING
ప్రజా సమస్యపై నిలదీసిన వ్యక్తినే కొట్టిన టీవీకే ఎమ్మెల్యే.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: భారీ పరిశ్రమలు, డేటా సెంటర్లకు ఆమోదం ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం.. పలమనేరు అభివృద్ధే లక్ష్యం 2 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు కసరత్తు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చిట్టమూరులో పోషణ్ శిక్షణ కార్యక్రమం టెంపో ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి హైదరాబాద్‌లో క్లౌడ్ కిచెన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తోబుట్టువుల అనుబంధాల పండుగ మహతీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భిణీలకు పౌష్టిక ఆహారంపంపిణి గీతా కార్మికుల పాలిట శ్రీరామ రక్ష కాటమయ్య రక్షణ కిట్లు వాడీవేడిగా మండల స్థాయి సమీక్ష సమావేశం విజయ్ ఆంటోని 'అప్ప కుట్టి' ప్రెస్‌మీట్: చెన్నై వేదికగా సినిమా విశేషాలు పంచుకున్న చిత్ర యూనిట్ రంగారెడ్డిని కరువు జిల్లాగా ప్రకటించాలి శబరిమల అయ్యప్ప భక్తులకు ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరి 'ఇట్లు అర్జున' వేదికపై రామ్ చరణ్ వ్యాఖ్యలు: సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై ట్రెండింగ్!

శబరిమల అయ్యప్ప భక్తులకు ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరి

Select Suryaa Now
శబరిమల అయ్యప్ప భక్తులకు ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరి

తిరువనంతపురం: శబరిమల శ్రీ అయ్యప్పస్వామి దర్శనార్థం విచ్చేసే భక్తులకు కేరళ పోలీసులు మరియు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు (TDB) అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాబోయే యాత్రా కాలాన్ని పురస్కరించుకుని స్వామివారి దర్శనానికి ముందస్తు వర్చువల్ క్యూ (Virtual Queue) స్లాట్ బుకింగ్ తప్పనిసరి అని స్పష్టం చేశారు.

భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్ సేవలు, క్యూ స్లాట్ నమోదు ప్రక్రియ వేగవంతం చేసేందుకు అధికారులు అధికారిక క్యూఆర్ (QR) కోడ్‌ను సైతం అందుబాటులోకి తెచ్చారు. అయ్యప్ప భక్తులు శబరిమల అధికారిక పోర్టల్ (sabarimalaonline.org) ద్వారా తమ వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకుని దర్శన స్లాట్‌ను ఖరారు చేసుకోవాలని సూచించారు. ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్ పాస్ (క్యూ పాస్) లేకుండా వచ్చే భక్తులు పంప వద్ద విచారణ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని అధికారులు పేర్కొన్నారు.