ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన
సూర్య, నంద్యాల బ్యూరో:రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలను కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేయడంతో పాటు వామపక్ష పార్టీల అభ్యర్థులను అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను భయాందోళనకు గురి చేయడమే కాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఎన్నికలు ప్రజాస్వామికంగా నిర్వహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ నెల 11వ తేదీ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సిపిఎం, సిపిఐ, వైఎస్ఆర్సిపి,కాంగ్రెస్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, ఎస్ డి పిఐ పార్టీల ఆధ్వర్యంలో కలిసొచ్చేటువంటి మేధావులను ప్రజాస్వామ్య వాదులను కలుపుకొని నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద 11వ తేదీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన వామపక్ష,ప్రతిపక్ష పార్టీల సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ ,సిపిఐ పట్టణ కార్యదర్శి కే ప్రసాద్, వైఎస్ఆర్సిపి పార్లమెంట్ యువజన విభాగం అధ్యక్షులు సన్నాల సాయిరాం రెడ్డి, ఎస్ డి పి ఐ నియోజకవర్గ అధ్యక్షులు ఏజాస్, నంద్యాల మండల సిపిఎం కార్యదర్శి వెన్న బాల వెంకట్ వీరితోపాటు ప్రజాసంఘాల నాయకులు నరసింహ నాయక్, పి వెంకట లింగం, కే మహమ్మద్ గౌస్, నాగరాముడు, ధనుంజయుడు, ఎం ఆర్ నాయక్, చెరుకు కృష్ణ పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతి లో ఎన్నికలను నిర్వహించడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పోలీసు బలగాలను అధికార యంత్రాన్ని పూర్తిగా పనిచేసేలాగున అప్రజా స్వామీకంగా ఎన్నికలు నిర్వహించడం జరిగిందని రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్,వైఎస్ఆర్సిపి ఇతర పార్టీల నాయకులను, కార్యకర్తలను,అందరిని నామినేషన్ వేయకుండా దుర్మార్గంగా కర్కశంగా వ్యవహరించి పోలీసు బలగాలను ఉపయోగించి అభ్యర్థులందరినీ భయభ్రాంతులకు గురిచేసి ఏకపక్షంగా ఎన్నికలను ఉపయోగించుకుని అధికారం చేజెక్కించుకోవాలనుకోవడం చాలా దుర్మార్గమని రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున ఈ దుర్మార్గాన్ని కొనసాగించే అవకాశం ఉందని ,ఇప్పటికైనా ప్రజాస్వామ్యవాదులంతా ప్రతిఘటన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందులో భాగంగానే నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద రేపు ఉదయం 10 గంటలకు జరిగే నిరసన కార్యక్రమంలో మేధావులు, ప్రజాతంత్ర వాదులు, ప్రజలు కలిసొచ్చే పార్టీల నాయకులందరూ, కార్యకర్తలంతా పాల్గొని నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా.