బాలీవుడ్ నటీనటులకు ముంబై పోలీసుల హెచ్చరికలు
ముంబై: గ్యాంగ్‌స్టర్ల నుంచి నిరంతర బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖ నటీనటులు అప్రమత్తంగా ఉండాలని ముంబై పోలీస్ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల నటుడు టైగర్ ష్రాఫ్ కారు లక్ష్యంగా జరిగిన కాల్పుల ఘటనతో పోలీసులు సినీ ప్రముఖుల భద్రతను సమీక్షించారు.
బహిరంగ ప్రదేశాల్లో అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడే సమయాల్లో మరియు రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరిగేటప్పుడు నటీనటులు తీవ్ర అప్రమత్తతతో ఉండాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లు లేని పక్షంలో బహిరంగ పర్యటనలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.