షార్ట్ సర్క్యూట్‌తో వాటర్ ప్యూరిఫైయర్ పేలి .. దగ్ధమైన ఇల్లు
(గండిపేట -మేజర్ న్యూస్) : రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్షాకోట్ 123వ డివిజన్ పరిధిలో గల శివసాయినగర్ ఫేజ్-2లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా వాటర్ ప్యూరిఫైయర్ పేలడంతో ఇంట్లో మంటలు చెలరేగి ఇల్లు దగ్ధమైనట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.