గోదావరి పుష్కరాలు–2027 ఏర్పాట్లకు పక్కా ప్రణాళిక రూపొందించాలి
సూర్య జగిత్యాల ప్రతినిధి:గోదావరి పుష్కరాలు –2027 ను దృష్టిలో ఉంచుకొని ధర్మపురి, ఇతర ప్రాంతాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్ల కోసం పక్కా ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా పుష్కరాల కోసం ఈ.వై. కన్సల్టెన్సీ, ఏజెన్సీ హైదరాబాద్ వారు రూపొందించిన ప్రాథమిక ప్రణాళికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు,ఈ.వై. కన్సల్టెన్సీ, ఏజెన్సీ ప్రతినిధులు వివరించారు.ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ప్రసునాంబ, ఈ.వై. కన్సల్టెన్సీ ఏజెన్సీ, ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.