BREAKING
ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం.. పలమనేరు అభివృద్ధే లక్ష్యం 2 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు కసరత్తు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చిట్టమూరులో పోషణ్ శిక్షణ కార్యక్రమం టెంపో ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి హైదరాబాద్‌లో క్లౌడ్ కిచెన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తోబుట్టువుల అనుబంధాల పండుగ మహతీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భిణీలకు పౌష్టిక ఆహారంపంపిణి గీతా కార్మికుల పాలిట శ్రీరామ రక్ష కాటమయ్య రక్షణ కిట్లు వాడీవేడిగా మండల స్థాయి సమీక్ష సమావేశం విజయ్ ఆంటోని 'అప్ప కుట్టి' ప్రెస్‌మీట్: చెన్నై వేదికగా సినిమా విశేషాలు పంచుకున్న చిత్ర యూనిట్ రంగారెడ్డిని కరువు జిల్లాగా ప్రకటించాలి శబరిమల అయ్యప్ప భక్తులకు ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరి 'ఇట్లు అర్జున' వేదికపై రామ్ చరణ్ వ్యాఖ్యలు: సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై ట్రెండింగ్! రాజకీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య: అసలు విషయం చెప్పిన నటుడు! బాలీవుడ్ నటీనటులకు ముంబై పోలీసుల హెచ్చరికలు

బలిపాడ్యమి సందర్బంగా శ్రీ మూలరాములకు మహాభిషేకం

Select Suryaa Now
బలిపాడ్యమి సందర్బంగా శ్రీ మూలరాములకు మహాభిషేకం


మంత్రాలయం, సూర్య ప్రతినిధి బలిపాడ్యమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మఠ పీఠాధిపతులు  శ్రీ సుభుదేంద్ర తీర్థ స్వామీజీ స్వయంగా శ్రీ బ్రహ్మ కరార్చిత శ్రీ మూలరాముల తో పాటు మఠంలోని ఇతర సంస్థాన దేవతామూర్తులకు మహాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు.
వేద మంత్రోచ్ఛారణలు, సంప్రదాయ పూజా విధానాల మధ్య జరిగిన ఈ మహాభిషేకం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. అనంతరం శ్రీ మూలరామదేవరు, శ్రీ దిగ్విజయ రామదేవరు, శ్రీ జయరామదేవరులకు స్వామీజీ అత్యంత భక్తిశ్రద్ధలతో పవిత్ర గంధలేపన కార్యక్రమాన్ని నిర్వహించారు. తదుపరి సంస్థాన పూజను శాస్త్రోక్తంగా జరిపించారు.
శ్రీ మఠ సంప్రదాయంలో మహాభిషేకానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఏడాదిలో కేవలం రెండుసార్లు మాత్రమే ఈ అరుదైన పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శ్రీరామనవమి, బలిపాడ్యమి పర్వదినాల్లో నిర్వహించే ఈ మహాభిషేకం భక్తులకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక ఘట్టంగా నిలుస్తుంది.
ఈ విశేష పూజా కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మంత్రాలయానికి తరలివచ్చారు. భక్తి పారవశ్యంతో స్వామివారి సేవలో పాల్గొని శ్రీ మూలరామదేవరి దర్శనం చేసుకున్నారు. అనంతరం శ్రీ సుభుదేంద్ర తీర్థ స్వామీజీ నుంచి ఆశీస్సులు అందుకున్నారు.
భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మిక వైభవం కలగలిసిన ఈ మహాభిషేక వేడుకతో మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి కొరువైన  పుణ్యక్షేత్రం భక్తజన సందోహంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
నల్లారెడ్డి, సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా