BREAKING
తోబుట్టువుల అనుబంధాల పండుగ మహతీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భిణీలకు పౌష్టిక ఆహారంపంపిణి గీతా కార్మికుల పాలిట శ్రీరామ రక్ష కాటమయ్య రక్షణ కిట్లు వాడీవేడిగా మండల స్థాయి సమీక్ష సమావేశం విజయ్ ఆంటోని 'అప్ప కుట్టి' ప్రెస్‌మీట్: చెన్నై వేదికగా సినిమా విశేషాలు పంచుకున్న చిత్ర యూనిట్ రంగారెడ్డిని కరువు జిల్లాగా ప్రకటించాలి శబరిమల అయ్యప్ప భక్తులకు ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరి 'ఇట్లు అర్జున' వేదికపై రామ్ చరణ్ వ్యాఖ్యలు: సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై ట్రెండింగ్! రాజకీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య: అసలు విషయం చెప్పిన నటుడు! బాలీవుడ్ నటీనటులకు ముంబై పోలీసుల హెచ్చరికలు రామ్‌చరణ్‌కు పదేళ్లు పట్టింది, అనీష్ తొలి చిత్రానికే ఆ సాహసం చేశాడు: నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు! ఆర్ కే విద్యాలయానికి జాతీయ స్థాయి గుర్తింపు బలిపాడ్యమి సందర్బంగా శ్రీ మూలరాములకు మహాభిషేకం 'రామాయణం' చిత్రంలో దశరథుడిగా నటించాలనే ఆసక్తి నాకు లేదు: నటుడు అరుణ్ గోవిల్ ఆసక్తికర వ్యాఖ్యలు! బోయినపల్లి పీఎస్ లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ - గంజాయి, సైబర్ నేరాలపై కఠిన చర్యలకు ఆదేశం

ఆర్.కే. విద్యాలయానికి జాతీయ గౌరవం - సుమైరాకు కాంస్య పతకం

Select Suryaa Now
ఆర్.కే. విద్యాలయానికి జాతీయ గౌరవం  - సుమైరాకు కాంస్య పతకం

చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:న్యూఢిల్లీలో నిర్వహించిన 70వ జాతీయ పాఠశాల క్రీడా పోటీల్లో అండర్-17 టెన్నిస్ బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున చిత్తూరుకు చెందిన ఆర్.కే. విద్యాలయ విద్యార్థిని సుమైరా అన్సారీ సయ్యద్ లక్ష్యత ప్రతిభ కనబరిచి కాంస్య పతకాన్ని సాధించడం గర్వకారణమని ఆర్.కే. విద్యాలయ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం. రమేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు.దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పాల్గొన్న క్రీడాకారులతో పోటీపడి ఈ ఘనత సాధించడం అభినందనీయమని, పట్టుదల, క్రమశిక్షణకు నిదర్శనమని పేర్కొన్నారు. విద్యార్థుల చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా ఆర్.కే. విద్యా సంస్థలు నిరంతరం ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎం. రమేష్ బాబు మాట్లాడుతూ సుమైరా సాధించిన విజయం పాఠశాలకే కాదు, చిత్తూరు జిల్లాకే గర్వకారణమని తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలని తమ సంస్థ ఎప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు. సుమైరా క్రమశిక్షణ, పట్టుదల ఇతర విద్యార్థులకు ఆదర్శమన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. పాఠశాల యాజమాన్యం తరపున ఆమెకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పతకాన్ని అందుకున్న విద్యార్థినిని కళాశాల మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ కల్పజ అభినందించారు. అలాగే కళాశాల ప్రిన్సిపాల్ ఎం. రమేష్ బాబు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

చిత్తూరు రిపోర్టర్ అజయ్ కుమార్