BREAKING
ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం.. పలమనేరు అభివృద్ధే లక్ష్యం 2 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు కసరత్తు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చిట్టమూరులో పోషణ్ శిక్షణ కార్యక్రమం టెంపో ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి హైదరాబాద్‌లో క్లౌడ్ కిచెన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తోబుట్టువుల అనుబంధాల పండుగ మహతీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భిణీలకు పౌష్టిక ఆహారంపంపిణి గీతా కార్మికుల పాలిట శ్రీరామ రక్ష కాటమయ్య రక్షణ కిట్లు వాడీవేడిగా మండల స్థాయి సమీక్ష సమావేశం విజయ్ ఆంటోని 'అప్ప కుట్టి' ప్రెస్‌మీట్: చెన్నై వేదికగా సినిమా విశేషాలు పంచుకున్న చిత్ర యూనిట్ రంగారెడ్డిని కరువు జిల్లాగా ప్రకటించాలి శబరిమల అయ్యప్ప భక్తులకు ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరి 'ఇట్లు అర్జున' వేదికపై రామ్ చరణ్ వ్యాఖ్యలు: సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై ట్రెండింగ్! రాజకీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య: అసలు విషయం చెప్పిన నటుడు! బాలీవుడ్ నటీనటులకు ముంబై పోలీసుల హెచ్చరికలు

ఎమ్మెల్యే బీవీ పై చల్లా వరుణ్ వ్యాఖ్యలు అర్థరహితం.. దామా

Select Suryaa Now
ఎమ్మెల్యే  బీవీ పై చల్లా వరుణ్ వ్యాఖ్యలు అర్థరహితం.. దామా


ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డిపై జనసేన నాయకుడిగా చెప్పుకుంటున్న చల్లా వరుణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి దామా నరసింహులు తీవ్రంగా ఖండించారు. కూటమి ధర్మంలో భాగంగానే జనసేనకు సీటు కేటాయించడం జరిగిందనే విషయాన్ని చల్లా వరుణ్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
2024 ఎన్నికలకు ముందు చల్లా వరుణ్ జనసేన పార్టీలో ఉన్న విషయం కూడా తమకు తెలియదని, ఒకవేళ పార్టీలో ఉన్నట్లయితే కూటమి ధర్మాన్ని పాటిస్తూ అభ్యర్థి విజయానికి ఎందుకు కృషి చేయలేదని ప్రశ్నించారు. జనసేన ఇన్‌చార్జి రేఖాగౌడ్‌తో పాటు, ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన సపోవు భాస్కర్ తదితరులు ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి విజయానికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.
కూటమి కోసం కష్టపడిన నాయకులు ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం లేదని, చల్లా వరుణ్ మాత్రం వైసీపీ కోవర్టుగా వ్యవహరిస్తూ మాట్లాడుతున్నారని దామా నరసింహులు ఆరోపించారు. కూటమి ఐక్యతకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయడం సరికాదని, నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
A R శరత్ కుమార్ సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా