andhrapradesh
ఎంపీపీ, జెడ్పీ అధ్యక్షుల పరోక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల పరిధిలోని మండల ప్రజా పరిషత్‌లు (ఎంపీపీ), జిల్లా ప్రజా పరిషత్‌ల (జెడ్పీపీ) అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల భర్తీకి ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం పరోక్ష ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 659 ఎంపీపీలు, 28 జెడ్పీపీ పదవులకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న ఎంపీపీలు, 20న జెడ్పీపీల అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపిక కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. స్థానిక పరిషత్ సభ్యులు చేతులెత్తే విధానం ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకోనుండగా, ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీల విప్ నిబంధన వర్తిస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.