BREAKING
విజయ్ ఆంటోని 'అప్ప కుట్టి' ప్రెస్‌మీట్: చెన్నై వేదికగా సినిమా విశేషాలు పంచుకున్న చిత్ర యూనిట్ రంగారెడ్డిని కరువు జిల్లాగా ప్రకటించాలి శబరిమల అయ్యప్ప భక్తులకు ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరి 'ఇట్లు అర్జున' వేదికపై రామ్ చరణ్ వ్యాఖ్యలు: సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై ట్రెండింగ్! రాజకీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య: అసలు విషయం చెప్పిన నటుడు! బాలీవుడ్ నటీనటులకు ముంబై పోలీసుల హెచ్చరికలు రామ్‌చరణ్‌కు పదేళ్లు పట్టింది, అనీష్ తొలి చిత్రానికే ఆ సాహసం చేశాడు: నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు! ఆర్ కే విద్యాలయానికి జాతీయ స్థాయి గుర్తింపు బలిపాడ్యమి సందర్బంగా శ్రీ మూలరాములకు మహాభిషేకం 'రామాయణం' చిత్రంలో దశరథుడిగా నటించాలనే ఆసక్తి నాకు లేదు: నటుడు అరుణ్ గోవిల్ ఆసక్తికర వ్యాఖ్యలు! బోయినపల్లి పీఎస్ లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ - గంజాయి, సైబర్ నేరాలపై కఠిన చర్యలకు ఆదేశం శర్వానంద్ 'భోగి' సినిమా విడుదల వాయిదా: సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీకి చిత్రం! సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలపై ఐటీడీపీ, వైఎస్సార్‌సీపీ కీలక నిర్ణయం హాస్టళ్లలో సెంట్రల్ పర్చేజింగ్ విధానాన్ని రద్దు చేయాలి మండల అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తా టికెట్ ఇచ్చిన పెద్దలకు, విజయానికి సహకరించిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు జెడ్పీటీసీ సభ్యురాలు పెళ్లూరు సౌజన్య రెడ్డి

మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూత

Select Suryaa Now
మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూత

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మలయాళ చలనచిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి సినిమాటోగ్రాఫర్‌గా గుర్తింపు పొందిన ప్రముఖ కెమెరామెన్ షాజీ కుమార్ తన యాభై ఏడేళ్ల వయసులో అనారోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచారు. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా సౌధాన్ వ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన పలు భారీ చిత్రాలకు ఆయన పనిచేశారు. మలయాళ స్టార్ హీరో దిలీప్ నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ నిమిత్తం ఆలప్పుళలో ఉన్న సమయంలో ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

షూటింగ్ స్పాట్‌లో తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్ సభ్యులు షాజీ కుమార్‌ను చికిత్స నిమిత్తం కొచ్చిలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించినప్పటికీ, ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన కోలుకోలేకపోయారు. షూటింగ్ బిజీలో ఉండగానే ఆయన ప్రాణాలు కోల్పోవడంతో మలయాళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు, దర్శకులు, నటీనటులు ఆయన హకస్మాత్ మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు.  

మూడు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగిన షాజీ కుమార్ తన అద్భుతమైన లైటింగ్, కెమెరా ఫ్రేమింగ్ ప్రతిభతో ఎన్నో అపురూప దృశ్యాలను తెరపై ఆవిష్కరించారు. మోహన్‌లాల్ హీరోగా నటించిన బాక్సాఫీస్ సెన్సేషన్ పులిమురుగన్, నరన్, ఒడియన్ వంటి చిత్రాలతో పాటు పొక్కిరి రాజా, రామలీల వంటి అనేక విజయవంతమైన సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. కెరీర్‌లో యాభైకి పైగా చిత్రాలకు వివిధ భాషల్లో సేవలందించిన ఆయన మృతి పట్ల ఫెఫ్కా డైరెక్టర్స్ యూనియన్‌తో పాటు పలు సంఘాలు ప్రగాఢ సానుభూతి ప్రకటించాయి.