BREAKING
ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం.. పలమనేరు అభివృద్ధే లక్ష్యం 2 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు కసరత్తు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చిట్టమూరులో పోషణ్ శిక్షణ కార్యక్రమం టెంపో ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి హైదరాబాద్‌లో క్లౌడ్ కిచెన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తోబుట్టువుల అనుబంధాల పండుగ మహతీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భిణీలకు పౌష్టిక ఆహారంపంపిణి గీతా కార్మికుల పాలిట శ్రీరామ రక్ష కాటమయ్య రక్షణ కిట్లు వాడీవేడిగా మండల స్థాయి సమీక్ష సమావేశం విజయ్ ఆంటోని 'అప్ప కుట్టి' ప్రెస్‌మీట్: చెన్నై వేదికగా సినిమా విశేషాలు పంచుకున్న చిత్ర యూనిట్ రంగారెడ్డిని కరువు జిల్లాగా ప్రకటించాలి శబరిమల అయ్యప్ప భక్తులకు ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరి 'ఇట్లు అర్జున' వేదికపై రామ్ చరణ్ వ్యాఖ్యలు: సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై ట్రెండింగ్! రాజకీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య: అసలు విషయం చెప్పిన నటుడు! బాలీవుడ్ నటీనటులకు ముంబై పోలీసుల హెచ్చరికలు

ఓటీటీకి వచ్చేసిన విభిన్న ప్రేమకథా చిత్రం 'కికు చిరంజీవి': స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Select Suryaa Now
ఓటీటీకి వచ్చేసిన విభిన్న ప్రేమకథా చిత్రం 'కికు చిరంజీవి': స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: తెలుగు తెరపై ప్రయోగాత్మక కథాంశాలతో రూపొందిన చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ ప్రత్యేకమైన ఆధరణ లభిస్తుంది. ఆ కోవకే చెందిన విభిన్నమైన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా 'కికు చిరంజీవి' సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో వైవిధ్యమైన అనుభూతిని పంచిన ఈ చిత్రం, త్వరలోనే ప్రముఖ తెలుగు ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్ కానుందంటూ మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీంతో సినిమా చూడని ప్రేక్షకులు, ఓటీటీ ప్రియులు ఈ డిజిటల్ ప్రీమియర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  

శుభసాయి వెంకట్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కికు యనమల హీరోగా నటించగా, కాశిష్ ఖాన్ హీరోయిన్‌గా మెప్పించారు. వీరితో పాటు ఈశ్వరీ రావు, తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రల్లో నటించి సినిమాను మరింత బలోపేతం చేశారు. అరుదైన గుండె సంబంధిత వైద్య సమస్యతో బాధపడుతున్న ఓ యువ ఫోటోగ్రాఫర్ జీవితం, వివాహంపై విభిన్నమైన అభిప్రాయాలున్న ఓ యువతి కలయిక చుట్టూ ఈ కథ నడుస్తుంది. సమాజంలో సాధారణంగా కనిపించని సరికొత్త కోణాన్ని స్పృశిస్తూ ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.  

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ 'ఆహా' దక్కించుకుంది. నవంబర్ 14 నుంచి ఈ చిత్రం ఆహా వేదికగా అధికారికంగా స్ట్రీమింగ్ కానుంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఓటీటీలోకి వస్తున్న ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ భావోద్వేగాలతో కూడుకుని ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. శేఖర్ చంద్ర అందించిన సంగీతం, సున్నితమైన భావోద్వేగాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవడంతో, డిజిటల్ రంగంలోనూ ఈ సినిమా అద్భుతమైన వ్యూస్‌ను సొంతం చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు