వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల – నిజామాబాద్ జాతీయ రహదారిపై జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్ వద్ద చేపడుతున్న వంతెన నిర్మాణ పనులను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పరిశీలించారు.పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాయికల్ మండలానికి వెళ్తున్న సందర్భంగా గాంధీనగర్ వద్ద జరుగుతున్న వంతెన నిర్మాణ పనులను పరిశీలించి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జగిత్యాల పట్టణానికి తాగునీటిని సరఫరా చేస్తున్న పైప్‌లైన్ దెబ్బతిన్న నేపథ్యంలో పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణమే పైప్‌లైన్ మరమ్మతు పనులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సమీండ్ల శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ స్వప్న గిరిధర్,సేవాదళ్ సెక్రటరీ ముకేష్ ఖన్నా పాల్గొన్నారు.