telangana
టీపీసీసీ అధికార ప్రతినిధుల నియామకాలపై స్టే
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధికార ప్రతినిధుల నియామకాల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. నిన్న విడుదల చేసిన నూతన అధికార ప్రతినిధుల నియామకాల ప్రకటనపై టీపీసీసీ అధ్యక్షులు బి. మహేష్ కుమార్ గౌడ్ హుటాహుటిన స్టే విధించారు.
ఈ నియామకాల ప్రక్రియపై స్పష్టత వచ్చే వరకు తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా జాబితాను నిలిపివేస్తున్నట్లు ఆయన ఆదేశాలు జారీ చేశారు. పార్టీలోని అంతర్గత సమన్వయం, సీనియర్ నేతల అభిప్రాయాల సేకరణ మరియు ఇతర సాంకేతిక కారణాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే అధిష్టానం పరిశీలన అనంతరం పూర్తిస్థాయి కొత్త జాబితాను ప్రకటించనున్నారు.