యాదమరిలో తెలుగుదేశం పార్టీ హవా... మాదిరెడ్డిపల్లి ఎంపీటీసీగా జే లావణ్య విజయం..
యాదమరి మేజర్ న్యూస్ :మండల పరిధిలో నిర్వహించిన ఎంపీటీసీ ఎన్నికల టిడిపి జై కేతనం ఎగరవేసి ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. పూతలపట్టు నియోజకవర్గంలో ఆర్ వి ఎస్ కాలేజీ నందు శనివారం నిర్వహించిన ఎంపీటీసీ కౌంటింగ్ ప్రక్రియలో యాదమరి మండలం నుండి మూడు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా అందులో తెలుగుదేశం పార్టీ రెండు స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. యాదమరి మండలంలో కోరహోరిగా జరిగిన ఎన్నికల్లో 2061 ఓట్లకు గాను మాదిరెడ్డిపల్లి ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ తరఫున జై లావణ్య1 166 ఓట్లు సాధించి విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి పి కుప్పమ్మ 7 8 5 ఓట్లు మాత్రమే దక్కాయి. యాద మరి ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలో2339 ఓట్లకు గాను తెలుగుదేశం పార్టీ తరఫున రవీంద్ర మొదటి మూడు ఓట్లు పొంది విజయం సాధించారు స్వతంత్ర అభ్యర్థి రమేష్ 884 ఓట్లు మాత్రమే దక్కాయి. సిద్ధారెడ్డిపల్లి ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలో1627 ఓట్లకు గాను స్వతంత్ర అభ్యర్థిగా లావణ్య 872 ఓట్లు సాధించి విజయం కైవసం చేసుకున్నారు జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన సుజాత 730 ఓట్లు మాత్రమే దక్కాయి. యాది మరి మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలకు 10 ఎంపీటీసీ స్థానాలు. ఏకగ్రీవమయ్యాయి మూడు ఎంపీటీ స్థానాలకు ఎన్నికలు జరగగా ఇందులో రెండు ఎంపీటీ స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది ఒక స్థానం మాత్రమే ఇండిపెండెంట్ కైవసం చేసుకుంది. యాదమరి మండలంలో మండల ప్రజాపరిషత్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది.
యాదమరి రిపోర్టర్, యస్ ఫైరూజ్ భాష.